Pakistan Elections 2024 : నెయ్ మార్.. బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు. దేశీయ, అంతర్జాతీయ టోర్నీలలో సత్తా చాటుతున్న ఆటగాడు. ఇటీవలి ఖతార్ ఫిఫా టోర్నీ లోను అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. ఇతర దేశాలలో క్లబ్ లతో ఒప్పందం కుదుర్చుకుని లీగ్ మ్యాచ్ లలో అతడు ఆడుతున్నప్పటికీ నెయ్ మార్ బ్రెజిల్ దేశాన్ని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్లే అవకాశం లేదు. బ్రెజిల్ పౌరసత్వాన్ని వదులుకునే అవకాశం అంతకన్నా లేదు.
నెయ్ మార్.. ఈ పోర్చుగల్ ఫుట్ బాల్ దిగ్గజం గురించి ఎంత చెప్పినా తక్కువే. చూస్తుండగానే బంతిని గోల్ పోస్ట్ వైపు పంపిస్తాడు. ఎంత తోపు జట్టయినా సరే తన దేశాన్ని గెలిపిస్తాడు. ఖతార్ లో జరిగిన ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో సత్తా చాటాడు.
ఫుట్ బాల్ లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుతున్న ఈ ఆటగాళ్లు పాకిస్తాన్ పౌరసత్వం తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? లేకుంటే ప్రపంచానికి తెలియకుండా వారు ఏమైనా పౌరసత్వం తీసుకున్నారా? చదువుతుంటే మెంటల్ ఎక్కుతుంది కదూ. మీకే కాదు కంటెంట్ రాస్తున్న మాకు కూడా అలానే ఉంది. ఉన్నట్టుండి ఆ ప్రశ్నలు ఎందుకు లేవనెత్తాల్సి వచ్చింది అంటే.. పాకిస్తాన్ దేశంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి భారీగానే సీట్లు వచ్చినప్పటికీ.. నవాజ్ షరీఫ్..మరో పార్టీ కలిసి అక్కడి సైన్యం అండతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.. ఈ నేపథ్యంలో పాకిస్థాన్లో జరిగిన ఎన్నికలపై రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వివాదం నెయ్ మార్, రోనాల్డో లు పాకిస్తాన్ దేశంలో ఓటు హక్కు కలిగి ఉండటం.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అక్కడ తీవ్రంగా చర్చ జరుగుతున్నది.
ఇటీవల పాకిస్తాన్ దేశంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వినిపించాయి. వాటికి బలం చేకూర్చుతూ సోషల్ మీడియాలో చాలామంది ఆధారాలతో పోస్టులు పెట్టారు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ కూడా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించింది. ఆ తర్వాత ఎందుకనో ఆ విషయంపై పెద్దగా స్పందించడం లేదు. మెజారిటీ స్థానాలు వచ్చినప్పటికీ తన పార్టీ నాయకులు ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటారని ఆయన జైలు నుంచి విడుదల చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. పాకిస్తాన్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు కనిపిస్తుండగా.. ఒకటి మాత్రం ఆసక్తికరంగా దర్శనమిస్తోంది. నెయ్ మార్, రోనాల్డో కు పాకిస్తాన్ దేశంలో ఓటు హక్కు కల్పిస్తూ అక్కడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సైన్యం ఆదేశాల మేరకు పాకిస్తాన్ దేశంలో ఇప్పటికీ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తుంటారు. ఓటు హక్కు కేటాయింపు విషయంలో అక్కడ సైన్యం చెప్పిందే వేదం కాబట్టి అధికారులు కూడా అదే విధంగా మసులుకుంటారు. అయితే నెయ్ మార్, రోనాల్డో లాంటి ఫుట్ బాల్ ఆటగాళ్లకు అక్కడ ఓటు హక్కు కల్పించడం విశేషం. అలా పాకిస్తాన్ అధికారులు కల్పించిన ఓటు హక్కు పత్రాలను ఓ వ్యక్తి చదువుతుండగా కొందరు వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో చూడగానే చాలామంది పాకిస్తాన్ ఎన్నికల్లో నెయ్ మార్, రోనాల్డో పోటీ చేస్తే బాగుంటుంది అని చమత్కరించారు. భారతదేశంలో ఇండియా కూటమి కూడా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరపాలని కోరుతోంది. అలా ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందో పాకిస్తాన్ దేశాన్ని చూసి నేర్చుకోవచ్చని కొంతమంది మెటీరియల్ చురుకలంటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
International football players like Neymar, Ronaldo etc cast their votes in Pak elections.
Now we know why I.N.D.I. Alliance wants to ban EVM pic.twitter.com/wTUjFmyoWV
— Saravanaprasad Balasubramanian (@BS_Prasad) February 10, 2024