తాను చేస్తే శృంగారం.. పక్కవాడు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉంది వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యవహారం. ఇతర పార్టీల వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తే ఎలాంటి చర్యలు ఉండనవసరం లేదు. అదే సొంత పార్టీ వారే విమర్శలు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఆయన పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాను తప్పుపట్టడంపై విమర్శలు వస్తున్నాయి.
గతంలో ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసింది. అయినా వారిపై ఎలాంటి అనర్హత వేటు వేయలేదు. ప్రస్తుతం రఘురామ వ్యవహారంపై విజయసాయిరెడ్డి స్పీకర్ కు రాసిన లేఖలో ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నట్లు తెలిసింది. గతేడాది జులై 3న ఇచ్చిన లేఖపై నిర్ణయం తీసుకోలేదని,
మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలనే సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్ పాటించలేదన్నారు. రఘురామ కృష్ణంరాజును పార్లమెంట్ సమావేశాలకు ఎందుకు హాజరు కానిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి లేఖ స్పీకర్ ను బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఉందని సమాచారం.ఇతర పార్టీల్లో చేరిన వారిపైనే అనర్హత వేటు వేస్తారు. స్పీకర్ నిర్ణయమే అంతిమమని తెలిసినా విజయసాయిరెడ్డి ఓంబిర్లాపై విమర్శలకు దిగడం బాధాకరమేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా అప్పటి స్పీకర్ పట్టించుకోలేదు. స్పీకర్ ను కోర్టులు నిర్దేశించలేవు. అన్ని తెలిసినా విజయసాయిరెడ్డి తొందరపడటం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. స్పీకర్ ఓం బిర్లాకు విజయసాయిరెడ్డి లేఖ రాయడంపై వివాదమే ఎదురవుతోంది. ప్రత్యర్థుల కోసం అయితే చట్టాన్ని ఉల్లంఘించడం, వైసీపీకి అయితే కామన్ అనే విషయంలో అందరిలో వ్యక్తమవుతోంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Vijayasai reddy writes a letter to lok sabha speaker
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com