Homeజాతీయ వార్తలుVarsha Gohil divorce case: ఓ మహిళ 23 ఏళ్ల పోరాటం.. 85 కోట్ల పరిహారం..ఈమె...

Varsha Gohil divorce case: ఓ మహిళ 23 ఏళ్ల పోరాటం.. 85 కోట్ల పరిహారం..ఈమె విడాకుల కథ సినిమాను మించి..

Varsha Gohil divorce case: ఏ భార్య కూడా తన భర్త మరో సంబంధం పెట్టుకుంటే తట్టుకోలేదు. గోల పెడుతుంది. భర్తను నిలదీస్తుంది. అవసరమైతే ఘర్షణకు దిగుతుంది. ఎందుకంటే భార్యలకు భర్తలంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. వారి మీద సర్వహక్కలూ వారికే ఉంటాయి. అటువంటిది ఓ మహిళ భర్త దారి తప్పాడు. మరోసంబందం పెట్టుకున్నాడు. ఆమెకు ఈ విషయం తెలసింది. అరిచింది, గోల పెట్టింది.. చివరికి కోర్టు మెట్లు ఎక్కింది. ఆమె పేరు వర్షా గోహిల్ లండన్ […]

Varsha Gohil divorce case: ఏ భార్య కూడా తన భర్త మరో సంబంధం పెట్టుకుంటే తట్టుకోలేదు. గోల పెడుతుంది. భర్తను నిలదీస్తుంది. అవసరమైతే ఘర్షణకు దిగుతుంది. ఎందుకంటే భార్యలకు భర్తలంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. వారి మీద సర్వహక్కలూ వారికే ఉంటాయి. అటువంటిది ఓ మహిళ భర్త దారి తప్పాడు. మరోసంబందం పెట్టుకున్నాడు. ఆమెకు ఈ విషయం తెలసింది. అరిచింది, గోల పెట్టింది.. చివరికి కోర్టు మెట్లు ఎక్కింది.

ఆమె పేరు వర్షా గోహిల్ లండన్ లో స్థిర పడిన భారతీయురాలు. ఈమెకు గతంలోనే వివాహం జరిగింది. ఈమె భర్త పేరు భద్రేశ్ గోహిల్. భద్రేశ్ వర్ష ఉండగానే మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. 2002లో అతడి నుంచి విడాకులు కావాలని వర్ష కోర్టు మెట్లు ఎక్కారు. ఆమె విడాకుల కేసు కోర్టు లో వేసే నాటికి ముగ్గురు సంతానాన్ని ఆమె కలిగి ఉన్నారు. ముందు ఆమె రూ.3.5 కోట్ల భరణానికి ఒప్పుకున్నారు.

భర్త తన ఆస్తిపాస్తుల విషయం ఆమెకు చెప్పేవాడు కాదు. ఎందుకో వర్షకు అనుమానం వచ్చింది. ఈనేపథ్యంలో ఆమె భర్తకు నైజీరియా మాజీ గవర్నర్ జేమ్స్ జుటోరీతో సంబంధాలున్నాయని వార్తలు మీడియాలో వచ్చాయి. వాటిని వర్ష ధ్రువీకరించుకుంది. ఆయన పై ఆర్థిక నేరాలకు సంబంధించిన విచారణ కూడా జరుగుతోందని ఆమె తెలుసుకుంది. అంతేకాదు భ్రజేశ్ కు సంబంధించిన ఆస్తులను అధికారులు జప్తు చేస్తున్నట్టు ఆమె తెలుసుకుంది.

ఈనేపథ్యంలో వర్ష తన భరణం కేసును మళ్లీ పరిశీలించాలని కోర్టకు విన్నవించింది. తన భర్తకు భారీగా ఆస్తులున్నాయని.. వాటి నుంచి తనకు మరింత సొమ్ము కావాలని ఆమె న్యాయస్థానానికి విన్నవించింది. అతడు సంపాదించింది మొత్తం అక్రమ సంపాదన కాదని, అందులో కష్టపడింది కూడా ఉందని వర్ష కోర్టుకు విన్నవించింది. ఆమె వాదనతో ఏకిభవించిన కోర్టు జప్తు చేసిన ఆస్తుల్లో దాదాపు 66 లక్షల పౌండ్లను వర్షకు చెల్లించాలని బ్రిటన్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు బ్రిటన్ దేశంలో సంచలనం కలిగించింది. కోర్టు కేసును మళ్లీ పరిశీలించి.. భరణం మంజూరు చేయించడం ఇంతవరకూ ఆ ధేశ న్యాయ చరిత్రలో జరగలేదని అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper