Janhvi Kapoor trolled by netizens: మహానటి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కి , అక్కడ వరుసగా పరాజయాలు ఎదురు అయ్యాయి. కానీ ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది , అద్భుతంగా నటిస్తోంది , డ్యాన్స్ కూడా అదరగొట్టేస్తుంది , మంచి భవిష్యత్తు ఉంది , తల్లి లాగానే ఈమె కూడా పెద్ద స్టార్ అవుతుందని అనుకున్నారు. కానీ వరుస ఫ్లాప్స్ రావడం తో ఆమె కెరీర్ ఒక్కసారిగా డైలమా లో పడింది. కానీ బాలీవుడ్ లో ఆమెకు కలిసిరాలేదు కానీ , టాలీవుడ్ మాత్రం బాగా కలిసొచ్చింది. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ద్వారా ఆమె మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఆమె వెంటనే ఒప్పుకున్న చిత్రం ‘పెద్ది’.
నిన్ననే థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం 400 కోట్లు రాబడుతుందా?, లేకపోతే 600 కోట్లు రాబడుతుందా అనే దానిపైనే ట్రేడ్ లో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అలా తెలుగు లో ఈమె నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడం ఆమె అదృష్టమే. కానీ ఈ రెండు సినిమాల్లోనూ డైరెక్టర్స్ ఆమెని చూపించిన విధానం అత్యంత నీచం గా ఉందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ‘దేవర’ చిత్రం లో జాన్వీ కపూర్ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. కేవలం అందాలను ఆరబోస్తూ, ఒక వ్యాంప్ లాగా ఆమెని చూపించాడు డైరెక్టర్ కొరటాల శివ. ‘పెద్ది’ చిత్రం లో అయితే జాన్వీ కపూర్ ని కొరటాల శివ కంటే నీచం గా చూపించాడు డైరెక్టర్ బుచ్చి బాబు. ఈ సినిమాకు అతి పెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే , అది జాన్వీ కపూర్ క్యారెక్టర్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.
థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి జాన్వీ కపూర్ క్యారెక్టర్ అంత చిరాకు కలిగించింది. ఆమె ముఖాన్ని తెరపై చూపించడం కంటే , ఆమె నడుము, మరియు ఇతర భాగాలను చూపించడానికే డైరెక్టర్ బుచ్చి బాబు ఎక్కువ శ్రద్ద పెట్టాడు. అందుకే జాన్వీ కపూర్, బుచ్చి బాబు లపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ కారాలు , మిరియాలు నూరుతున్నారు. జాన్వీ కపూర్ చాలా సత్తా ఉన్న నటి అని , ఆమెని మన తెలుగు డైరెక్టర్ వ్యాంప్ పాత్రలకే పరిమితం చేస్తున్నారని , ముఖ్యంగా పెద్ది చిత్రం లో ఆమెని చూపించిన విధానంపై ఆడియన్స్ చాలా ఫైర్ మీద ఉన్నారని , బుచ్చి బాబు రోడ్డు మీద కనిపిస్తే ఆడియన్స్ కొట్టేసేలా ఉన్నారని అంటున్నారు నెటిజెన్స్.
