Homeఆంధ్రప్రదేశ్‌TDP Leader Arrested: మహిళను నగ్నంగా కూర్చోబెట్టి అలా చేశాడు.. టీడీపీ నేత అరెస్ట్ వెనుక...

TDP Leader Arrested: మహిళను నగ్నంగా కూర్చోబెట్టి అలా చేశాడు.. టీడీపీ నేత అరెస్ట్ వెనుక పెద్ద కథ!

TDP Leader Arrested: గుంటూరులో ఇద్దరు మహిళలతో నగ్నంగా క్షుద్ర పూజలు చేయించిన విషయం మరువక ముందే.. ఆంధ్రప్రదేశ్‌లోనే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తారకరామనగర్‌లో నగ్న పూజలు నిర్వహించి.. మహిళపై లైంగిక దాడి చేశారనే ఆరోపణలపై టీడీపీ ఎస్సీ సెల్‌ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అంశంపై రాజకీయ రగడ మొదలైంది. ఈ కేసులో సుబ్బయ్యను కావాలనే ఇరికించారనేది టీడీపీ నేతల ఆరోపిస్తున్నారు.

విస్తుపోయే విషయాలు చెప్పిన పోలీసులు..
అయితే, ఈ కేసులో పోలీసులు వెల్లడించిన అంశాలు మాత్రం కలకలం రేపుతున్నాయి. సుబ్బయ్య తాంత్రిక పూజలు చేస్తారని స్థానికంగా గుర్తింపు ఉంది. దాంతో తనపై చేతబడి జరిగిందనే అనుమానంతో ఓ మహిళ విరుగుడు పూజల కోసం సుబ్బయ్యను సంప్రదించినట్టు పోలీసులు చెబుతున్నారు. పూజల కోసం 20 వేలకు బేరం కుదుర్చుకుని .. అడ్వాన్స్‌ కింద 7,500 బాధితురాలు చెల్లించినట్టు పోలీసులు చెబుతున్నారు.

మహిళ ఇంట్లోనే అఘాయిత్యం..
ఈనెల 14న మహిళ ఇంట్లోనే పూజలు చేశారని.. అక్కడ ముగ్గు వేసి అందులో బాధిత మహిళను నగ్నంగా కూర్చోవాలని సుబ్బయ్య చెప్పడంతో ఆమె ఒప్పుకొన్నట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మహిళపై సుబ్బయ్య లైంగిక దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. సుబ్బయ్యను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇంకా మూఢనమ్మకాలేనా..
టెక్నాలజీ పెరుగుతున్నా.. ఇంకా చాలా మంది మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. తాత్రిక పూజలు, మంత్ర తంత్రాలను నమ్ముతున్నారు. ఏపీలోనే ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదో మారుమూల ప్రాంతంలో కాకుండా… పట్టణ ప్రాంతాల్లో జరుగడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంత్ర తంత్రాలను నమ్మేవారి బలహీనతను దొంగ స్వామీజీలు సొమ్ము చేసుకుంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular