Shikhar Dhawan Catch: ఐపీఎల్‌లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రతీ మ్యాచ్ ఆసక్తిగా, ఉత్కంఠగా సాగుతోంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక ఫీల్డర్లు కూడా తామేం తక్కువ తిన్నాం అన్నట్లు స్టన్నింగ్ క్యాచ్‌లు, రన్‌ఔట్‌లతో మ్యాచ్ ఫలితానే మార్చేస్తున్నారు. ప్రతి సీజన్ లోనూ అలాంటి కనీసం ఒక్క క్యాచైనా అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ అద్భుతరీతిలో క్యాచ్ అందుకున్నాడు. సామ్ కరణ్ బౌలింగ్‌లో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్(46) గాల్లోకి లేపిన బంతిని ధావన్ పరుగెడుతూ ఒంటి చేత్తో అసాధారణ రీతిలో క్యాచ్ పట్టాడు. దీంతో నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కీలకపోరులో ఓడిన పంజాబ్..
ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక పోరులో పంజాబ్ పోరాడి ఓడింది. 214 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లివింగ్‌స్టోన్(94: 48 బంతుల్లో 9 సిక్స్‌లు, 5 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగినప్పటికీ తమ జట్టును గెలిపించలేకపోయాడు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పంజాబ్ ఫ్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.
మొన్న గ్రేటెస్ట్ క్యాచ్..
ఐపీఎల్ హిస్టరీలోని గ్రేటెస్ట్ క్యాచ్‌లలో గత ఆదివారం జరిగిన ముంబై, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సందీప్ స్టన్నింగ్ క్యాచ్ వైరల్‌గా మారింది. ఐపీఎల్ హిస్టరీలో ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో 213 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ (55 : 28 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. మిస్టర్ 360 వేగంగా ఆడే ప్రయత్నంలో ఉండగా.. 15.3 ఓవర్ వద్ద బౌల్ట్ బౌలింగ్ ో భారీ షాట్ కి ప్రయత్నించాడు. బంతి చాలా సేపు గాల్లోకి లేచింది. సందీప్ శర్మ ఏకంగా 19 మీటర్లు ముందుకు పరిగెత్తి గాల్లోకి ఎగిరి కళ్లు చెదిరే క్యాచ్ ను అందుకున్నారు. దీనిని ఏ మాత్రం ఊహించలేదు సూర్య. దీంతో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
1983 వరల్డ్ కప్‌లో కపిల్‌లా..
సందీప్ క్యాచ్ చూడగానే 1983 వరల్డ్ కప్ ఫైనల్‌లో కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ గుర్తుకొస్తుందంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేశారు. పెడుతున్నారు. 1983 ప్రపంచకప్ లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండిస్ బ్యాటర్ వివిఎన్. రిచర్డ్స్ కొట్టిన బంతిని కూడా ఇదేవిధంగా పరుగెత్తి అద్భుతంగా అందుకున్నాడు.
Absolutely Stunning! ⚡️ ⚡️
DO NOT MISS this brilliant catch from @PunjabKingsIPL captain @SDhawan25 🎥 🔽
A much-needed breakthrough for #PBKS 👌 👌
Follow the match ▶️ https://t.co/lZunU0I4OY #TATAIPL | #PBKSvDC pic.twitter.com/3j8NqsKJk8
— IndianPremierLeague (@IPL) May 17, 2023