Homeజాతీయ వార్తలుTamil Nadu Liquor Scam: మద్యం షాపుల నుంచి 1600 కోట్ల లంచాల వసూలు.. తమిళనాడు...

Tamil Nadu Liquor Scam: మద్యం షాపుల నుంచి 1600 కోట్ల లంచాల వసూలు.. తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం..

Tamil Nadu Liquor Scam: తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ప్రతి పరిణామం దేశ రాజకీయాలలో సరికొత్త చర్చకు దారి తీస్తోంది. వాస్తవానికి అక్కడ జరుగుతున్న రాజకీయ.. ఇతర పరిణామాలు ఏకంగా దేశాన్ని కదిలించే స్థాయిలో ఉంటున్నాయి. గతంలో తమిళనాడులో ఇలా ఉండేది కాదు. ఇటీవల కాలంలో ముఖ్యంగా విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ జరుగుతున్న ప్రతి సంఘటన కూడా దేశ రాజకీయాలను కదిలిస్తోంది. నేషనల్ మీడియా కూడా తమిళనాడులో జరుగుతున్న పరిణామాల పట్ల విపరీతమైన అటెన్షన్ తో ఉంటుందంటే మామూలు విషయం కాదు.

తమిళనాడులో మొన్నటిదాకా డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. తమిళనాడులో మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తుంది. అక్కడ 4048 మద్యం షాపులు ఉన్నాయి. గతంలో విచ్చలవిడిగా అక్కడ మద్యం షాపులు ఉండేవి. అయితే విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గుడులు.. మసీదులు. చర్చిల దగ్గర ఉన్న మద్యం షాపులను తొలగించారు. పాఠశాలలకు.. విద్యాలయాలకు దగ్గరగా ఉన్న మద్యం షాపులను కూడా తొలగించారు. జాతీయ రహదారి పక్కన ఏర్పాటుచేసిన మద్యం షాపుల విషయంలో కూడా ఆయన అదే నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం మద్యం షాపులను అక్కడ నిర్వహిస్తోంది. అయితే గత డీఎంకే ప్రభుత్వంలో పార్టీకి విరాళాల పేరుతో మద్యం షాపుల వద్ద దాదాపు 1600 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం గత డీఎంకే హయాంలో జరిగిన ఈ పరిణామంపై తీవ్రంగా దృష్టి పెట్టింది. ఏకంగా ముఖ్యమంత్రి విజయ్ ఈ విషయం మీద విచారణ సాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. మద్యం షాపులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ.. అప్పటి అధికార పార్టీ నేతలే ఇష్టానుసారంగా వ్యవహరించాలని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్టీ ఫండ్ పేరుతో 1600 కోట్లు వసూలు చేయడానికి విజయ్ తీవ్రంగా తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది.

మద్యం షాపుల విషయంలో ఎవరు ఎంత తీసుకున్నారు.. 1600 కోట్ల రూపాయలను ఎలా వసూలు చేశారు.. ఇందులో ఏదైనా మనీలాండరింగ్ జరిగిందా.. నాటి ప్రభుత్వ పెద్దలలో ఎవరి వాటా ఎంత.. ఈ డబ్బులు వారు ఏం చేశారు.. ఎక్కడికి తరలించారు అనే కోణంలో తమిళ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం. అయితే ఇందులో నాటి ప్రభుత్వ పెద్దలలో అత్యంత కీలకంగా ఉన్న వారికే వాటాలు వెళ్లినట్టు తమిళ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై విచారణ నిర్వహించిన తర్వాత.. కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. అయితే తదుపరి పరిణామాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular