Surrendered Maoists: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పినట్టుగానే ఆపరేషన్ కగార్ ద్వారా దేశంలో మావోయిస్టులను, వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపుతామని అన్నారు. దానికి తగ్గట్టుగానే కేంద్రం అడుగులు వేయడం.. బలగాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఆపరేషన్లు చేపట్టడంతో.. మావోయిస్టులు చనిపోయారు. ఇందులో చాలామంది జనజీవన స్రవంతిలో కలిశారు.
ఒడిశా నుంచి మొదలుపెడితే చతిస్గడ్ వరకు.. మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే తెలంగాణ వరకు ప్రాబల్యంగా ఉన్న మావోయిస్టులు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. కొందరైతే ఎదురుకాల్పుల్లో నేలకు ఒరిగి పోతున్నారు. తద్వారా మావోయిస్టుల బలం కాస్త తగ్గిపోతుంది. కేంద్ర ప్రకటించినట్టుగానే ఈ మార్చి నెల వరకు మావోయిస్టుల ఉనికి దేశవ్యాప్తంగా ప్రశ్నార్ధకం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
మావోయిస్టులు కొంతమంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇంకా కొంతమంది పోలీసుల ఎదుట లొంగిపోయి.. సమాజంలో కలిసిపోతున్నారు. వీరంతా కూడా ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలతో ఆర్థికంగా భరోసా పొందుతున్నారు. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత మావోయిస్టులు తమ సంసార జీవితాన్ని మళ్లీ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఉద్యమంలో ఉన్నప్పుడు మావోయిస్టులు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించుకునేవారు. అయితే ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత మళ్ళీ వారు పిల్లలను కనడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే మళ్లీ ఆపరేషన్లు చేయించుకుని.. సంసార జీవితంలో పాల్గొంటున్నారు. తమకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటున్నారు.. ఇటీవల కాలంలో జనజీవన స్రవంతిలో కలిసిపోయిన మావోయిస్టులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వారంతా ఆపరేషన్లు చేయించుకుని మళ్ళీ పిల్లల్ని కనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
“ఒక ఉద్యమం సమాజ ఉద్ధరణకు తోడ్పడాలి. ప్రజల సమస్యలకు పరిష్కార బాట చూపించాలి. అలా కాకుండా రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా.. వ్యవస్థలను లెక్కచేయకుండా ఇష్టానుసారంగా హింస కు పాల్పడితే దానిని ఉద్యమం అనరు. రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలను హింసిస్తే దానిని పోరాటం అనరు. ఇప్పటికే మావోయిస్టులు దీన్ని గుర్తించాలని” భారతీయ జనతా పార్టీ నాయకులు అంటున్నారు..