Narayana Brother Wife Priya: మాజీ మంత్రి నారాయణ పై ఆయన సోదరుడి భార్య మణి ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. తనకు వివాహం నాటి నుంచే నారాయణ టార్చర్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ లో వీడియోను పోస్ట్ చేశారు. తన వివాహం నాటి నుంచి జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు.’ పెట్టను డేగ ఎత్తికెళ్ళినట్టు నా పరిస్థితి ఉంది ‘.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన చూపు ఎప్పుడూ వక్రబుద్ధితో ఉండేదని చెప్పుకొచ్చారు. భార్య ఉండగానే అన్నం తీసుకు రాలేదని కొట్టేవాడని.. అర్ధరాత్రి వరకు వేధింపులకు గురి చేసేవాడని తీవ్ర ఆరోపణలు చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెల్లూరుకు చెందిన నారాయణ కు సోదరుడు మణి ఉన్నారు. ఆయన భార్యే ప్రియ. ప్రస్తుతం వీరు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. అయితే ఇప్పుడు ప్రియ అకస్మాత్తుగా సోషల్ మీడియా వేదికగా ముందుకు రావడం అనుమానాలకు తావిస్తోంది. అయితే మరో వీడియోతో మరిన్ని వివరాలతో కలుస్తామని ప్రియ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తనపై కన్నేసిన నారాయణ సోదరుడితో వివాహం చేయించారని చెప్పుకు రావడం.. మరిన్ని వివరాలతో మరో వీడియోతో కలుద్దాం అని చెప్పడంతో ఆసక్తి రేపుతోంది.
ప్రస్తుతం నారాయణ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో సోదరుడి భార్య హాట్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఎన్నికల ముంగిట ఈ అంశం బయటికి రావడం అనుమానాలను రేకెత్తిస్తోంది. దీనిపై మాజీ మంత్రి నారాయణ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
టీడీపీ నేత మాజీ మంత్రి నా మీద కన్నేశాడు అంటూ సంచలన అరోపణలు చేస్తూ వీడియో విడుదల చేసిన నారాయణ తమ్ముడి భార్య మణి ప్రియ#Narayana pic.twitter.com/PQGarArRA2
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2023