spot_img
Homeజాతీయ వార్తలుSanjay Raut book on Modi controversy: ఆయన అడ్డుకోకుంటే మోదీ జైలుకు వెళ్లేవాడు..సంచలన విషయాలతో...

Sanjay Raut book on Modi controversy: ఆయన అడ్డుకోకుంటే మోదీ జైలుకు వెళ్లేవాడు..సంచలన విషయాలతో సంజయ్‌ రౌత్‌ పుస్తకం!

Sanjay Raut book on Modi controversy: భారత ప్రధానిని జైల్లో పెట్టే ప్రయత్నాలు జరిగాయి. గుజరాత్‌ అల్లర్ల సమయంలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కారణంగానే అల్లర్లు జరిగాయని ఆప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే సుప్రీం కోర్టు తీర్పుతో ఆయనకు ఊరట దక్కింది. అయితే 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోదీ అరెస్టుకు యత్నించింది. కానీ యూపీఏలో భాగస్వామి అయిన ఓ కీలక నేత అడ్డుకోవడంతో అరెస్టు చేయలేదట. ఈ విషయాన్ని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ తన పుస్తకంలో పేర్కొన్నాడు.

చక్రం తిప్పిన శరద్‌పవార్‌
యూపీఏ ప్రభుత్వం నరేంద్రమోదీని గుజరాత్‌ అల్లర్ల కారణంగా అరెస్టుకు ప్రణాళిక రూపొందించింది. అయితే ఆ ప్రతిపాదనను నాడు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ అడ్డుకున్నారు. ప్రజల ఓట్లతో గెలిచి సీఎం అయిన వ్యక్తిని అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. దీనికి యూపీఏలోని ఇతర పక్షాలు కూడా మద్దతు తెలిపాయట. దీంతో నాటి యూపీఏ ప్రభుత్వం మోదీ అరెస్టు ఆలోచనను విరమించుకుందని సంజయ్‌రౌత్‌ తను రాసిన అన్‌లైక్‌లీ ప్యారడైజ్‌ పుస్తకంలో పేర్కొన్నారు.

ధన్‌కడ్‌ రాజీనామాకు ఈడీతో ఒత్తిడి..
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌ రాజీనామా వెనుక ఈడీ ద్వారా రూపొందించిన కేసు ఉందని రౌత్‌ వెల్లడి చేశారు. జైపూర్‌ ఆస్తి విక్రయ డబ్బును విదేశాలకు పంపారట. అయితే ఈ సమయంలో నిబంధలు ఉల్లఘించారనట. జగదీప్‌పై అసంతృప్తితో ఉన్న మోదీ ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించేందుకు ఈడీని వాడిందని రౌత్‌ తెలిపారు.

Also Read: రాహుల్ సరెండర్ మోడీ అంటాడు గాని.. ప్రతి భారతీయుడు మోడీకి జై కొట్టేది ఇదిగో ఇందుకే!

ఎన్నికల అధికారిని కూడా..
2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ, అమిత్‌ షా ప్రచారాల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన ఎన్నికల సంఘం కమిషనర్‌ అశోక్‌ లావాసా చర్యలకు ఒత్తిడి పడ్డారని రౌత్‌ తన పుస్తకంలో రాశారు. ఇతర సభ్యులు చర్యలు నివారించగా, లావాసా వ్యతిరేకించడంతో ఈడీ కేసు ప్రణాళిక ఏర్పడిందని ఆరోపణ ఉంది. ఆయన రాజీనామా వెనుక ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఉద్యోగమే కారణమని అప్పటి వాదనలకు ఈ వెల్లడి కొత్త కోణం ఇస్తోంది.

అమితషాను కాపాడిన థాక్రే..
2002 ఘటనల నేపథ్యంలో అమిత్‌ షాపై కేసులు, అరెస్టు, గుజరాత్‌ నుంచి బహిష్కరణ జరిగినప్పుడు, బాల్‌ థాక్రే ఇంటికి చేరుకుని శరద్‌ పవార్‌ సహాయం కోరారని రౌత్‌ రాశారు. సీబీఐ అధికారి బెయిల్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించాగా, పవార్‌ సహకారంతో రక్షించబడ్డారట. ఈ విషయం రాజకీయ వ్యతిరేకుల మధ్య రహస్య సంబంధాలను సూచిస్తూ, చరిత్రను మళ్లీ పరిశీలింపజేస్తోంది.

కసబ్‌కు బిర్యానీ వట్టిదే అంట..
ముంబై దాడి నిందితుడు కసబ్‌పై జైలులో బిర్యానీలు అందించారని ప్రచారాలు వ్యాప్తమైనప్పుడు, రౌత్‌ తన జైలు అనుభవాల ఆధారంగా ఖండించారు. బదులుగా మూత్రం బలవంతంగా తాగించారని వెల్లడి. పుస్తకం మొత్తం ఈడీ వంటి ఏజెన్సీలను రాజకీయ ఆయుధంగా మార్చినట్టు వాదిస్తూ, బీజేపీ వ్యవస్థలపై టార్గెట్‌ చేస్తుంది.

రౌత్‌ ఆరోపణలు 2004 మోదీ అరెస్టు ప్రయత్నాలు వాస్తవమేనని, సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆగాయని పేర్కొంటున్నాయి. బీజేపీ ఆధారాలు చాటాలని డిమాండ్‌ చేస్తోంది. మరాఠీ నుంచి ఇంగ్లీష్‌కు తర్జుమా, కొత్త అధ్యాయాలతో విడుదలైన ఈ పుస్తకం రాజకీయ చర్చలకు కేందంగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper