Homeజాతీయ వార్తలుRahul Gandhi vs Narendra Modi: రాహుల్ సరెండర్ మోడీ అంటాడు గాని.. ప్రతి భారతీయుడు...

Rahul Gandhi vs Narendra Modi: రాహుల్ సరెండర్ మోడీ అంటాడు గాని.. ప్రతి భారతీయుడు మోడీకి జై కొట్టేది ఇదిగో ఇందుకే!

Rahul Gandhi vs Narendra Modi: ఆ రాహుల్ గాంధీ సమయం దొరికితే చాలు నరేంద్ర మోడీ మీద మండిపడుతుంటాడు. రాజకీయానికి.. జాతీయభావానికి తేడా ఏమిటో రాహుల్ గాంధీకి ఇంకా తెలియదు. రాహుల్ గాంధీకి చెప్పేవారు లేరా.. చెబితే వినిపించుకోడా.. ఏంటో కాంగ్రెస్ పార్టీకి దురవస్థ. రాహుల్ గాంధీ లో లోపాలే నరేంద్ర మోడీకి వరాలుగా మారుతున్నట్టున్నాయి. అందువల్లే ఏక ఛత్రాధిపత్యంగా నరేంద్ర మోడీ దేశాన్ని పాలిస్తున్నారు .

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. భారత్ పై ఏదో ఒక రూపంలో ఆ ప్రభావం పడుతుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే చమురు.. గ్యాస్ విషయంలో భారత్ మీద ఆ ఎఫెక్ట్ పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్ గా భారత్ ఉంది. చమురు, గ్యాస్ వంటివి సరఫరా కాకపోతే దేశంలో పరిస్థితి దారుణంగా మారుతుంది. అందువల్లే నరేంద్ర మోడీ ఇక్కడ తన చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఎంతో చతురతతో ప్రపంచ దేశాలను ఒప్పించారు. ఇరాన్ గ్యాస్ సరఫరా చేయడానికి ఒప్పుకుంది. అమెరికా కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా భారత్ కు ద్వారాలు తెరిచింది. ఒక నాయకుడు బలంగా ఉంటే.. ఏ దేశమైనా సరే సలాం చేస్తుంది. అందుకు మోడీ నాయకత్వం బలమైన ఉదాహరణ.

భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాలలో ఒకటిగా ఉంది. భారత్ వద్ద ఉన్న సైనిక బలాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సైన్యం ఉన్న దేశంగా భారత్ ఉంది. ఆసియాలో చైనా, రష్యా తర్వాత సైనిక సామర్థ్యంపరంగా భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్ ఎప్పుడూ కూడా ఇతర దేశాల మీద దాడి చేయలేదు. ప్రతి సందర్భంలోనూ స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మాత్రమే కోరుకున్నది. అంతటి పాకిస్తాన్ ఉగ్రవాదులతో జతకట్టి.. ఘోరాలకు పాల్పడితే.. భారత్ ప్రతి సందర్భంలోనూ గట్టి బదులిచ్చింది. పాకిస్తాన్ మినహా.. ఏ దేశం మీద కూడా భారత్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దాడి చేయలేదు.

Also Read: భారత్‌ త్రిముఖ వ్యూహం.. ఇక ఎల్‌ఎన్‌జీ కొరత తీరినట్లే!

ఇక ఇజ్రాయిల్ దేశంతో భారతదేశానికి బలమైన సంబంధాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ సంబంధాలు మరింతగా బలపడ్డాయి. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి భారత నాయకత్వం మీద తన ఆత్మీయతను.. అనుబంధాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీని తనకు ఇష్టమైన స్నేహితుడిగా అభివర్ణించారు. కేవలం ఇజ్రాయిల్ తో మాత్రమే కాకుండా భారత్ ఇరాన్ తో కూడా బలమైన సంబంధాలను కొనసాగిస్తుంది. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. భారత్ ఉభయ కుశలోపరి విధానాన్ని కొనసాగించింది. అందువల్లే ఇరాన్ ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండానే మనకు గ్యాస్.. క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తోంది.

వాస్తవానికి మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తలు కొనసాగుతున్నప్పటికీ.. రాహుల్ గాంధీ నాయకులు సరెండర్ మోడీ అని విమర్శలు చేసినప్పటికీ.. నరేంద్ర మోడీ తన స్థిరత్వాన్ని కోల్పోలేదు. ఇక్కడ రాజకీయాల కంటే దేశ సామరస్యం.. అభివృద్ధి కోసమే ఆయన కట్టుబడి ఉన్నారు. అందువల్లే ట్రంప్ ఆదేశించినప్పటికీ హర్ముజ్ జల సంధిలో భారత్ నౌకలను మోహరించలేదు. అపరమైన నావికాదళ బలమున్నప్పటికీ ట్రంప్ చెప్పినట్టు నరేంద్ర మోడీ చేయలేదు.. ఒక ప్రాంతీయ సంఘర్షణలో ప్రత్యక్ష పాత్ర పోషించడానికి సుముఖత లేదని నరేంద్ర మోడీ తన విధానాల ద్వారా స్పష్టం చేశారు.

కొంతమంది నరేంద్ర మోడీ నాయకత్వాన్ని.. భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. కానీ అలాంటివారు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రపంచంలో అస్థిరత ఉంది. అశాంతి కనిపిస్తోంది. ఇంకా అనేక రకాలైన సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే అంతటి కల్లోల ప్రపంచంలో భారత్ ప్రశాంతంగా ఉంది. సురక్షితంగా ఉంది. శాంతియుతంగా ఉంది. ఇలా ఉంటుందని ఎవరైనా ఊహించగలరా.. మిడిల్ ఈస్ట్ దేశాల ప్రజల ఫోన్లకు అక్కడి ప్రభుత్వాల నుంచి మిస్సైల్స్ దాడులు.. డ్రోన్ దాడుల గురించి హెచ్చరికలు వస్తున్నాయి. కానీ భారత్ లో ప్రజలు మాత్రం సినిమాలు.. యూట్యూబ్.. ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఆనందంగా ఉంటున్నారు. దీనిని బట్టి మోడీ నాయకత్వ పటిమ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular