spot_img
Homeజాతీయ వార్తలుRatna Debnath role in BJP Bengal success: సువేందు అధికారి కాదు.. బెంగాల్ బిజెపికి...

Ratna Debnath role in BJP Bengal success: సువేందు అధికారి కాదు.. బెంగాల్ బిజెపికి దక్కడం లో ఈమెదే కీలకపాత్ర

Ratna Debnath role in BJP Bengal success: అనుమానమే లేదు మమత బెనర్జీలో విపరీతమైన పొగరు ఉంటుంది. ఆమె ఒక మహిళనే అయినప్పటికీ.. మానవత్వం, కరుణ అనేవి కనిపించవు. అందువల్లే 15 సంవత్సరాలపాటు కర్కశంగా పరిపాలన సాగించింది. వ్యవస్థలను మొత్తం తన చేతుల్లో పెట్టుకుంది. ప్రభుత్వాన్ని మొత్తం సామంత రాజ్యంగా మార్చేసుకుంది. చివరికి మహిళలపై దాడులు జరుగుతుంటే జస్ట్ చూస్తూ ఊరుకుంది. తాను నియమించిన ప్రైవేట్ సైన్యం అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉంటే.. వికృతానందం పొందింది.

వెస్ట్ బెంగాల్లో ఆర్జీ కర్ అనే మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థిని దారుణమైన స్థితిలో చనిపోయింది. మొదట్లో ఆత్మహత్య అనుకున్నారు. ఆ తర్వాత హత్య అని తేలింది. ఈ వ్యవహారం వెనుక ఓ వ్యక్తి ఉన్నాడని.. అతడు దరణానికి పాల్పడి చంపేశాడని పోలీసుల విచారణలో తేలింది. నాడు ఆమె హత్యపై బెంగాల్ రాష్ట్రం మొత్తం అట్టుడికి పోయింది. వైద్యులు సహాయ నిరాకరణ చేశారు. విచారణకు అధికారులు వస్తుంటే.. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఆధారాలు లేకుండా చేశారు. ఆస్పత్రిలో రణరంగం సృష్టించారు. ఇదంతా కూడా మమత బెనర్జీకి తెలియకుండా జరిగింది అనుకోలేం. దుర్గాదేవి ఉత్సవాలు జరుగుతుంటే.. ఓ మహిళ దారుణమైన స్థితిలో చనిపోతాయి కనీసం మమత స్పందించలేదు. పైగా వైద్యులు.. వైద్య విద్యార్థులు మమతను కలిసి తమ సమస్యలు చెప్పుకుందామని వెళ్తే.. మమత ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా వైద్యుల డిమాండ్లు అర్థం లేనివని వ్యాఖ్యానించారు.

ఆర్ జి కర్ ఆస్పత్రిలో చనిపోయిన వైద్య విద్యార్థిని తల్లి రత్న దేబ్ నాథ్ కు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి టికెట్ ఇచ్చింది. ఆమె పానీ హతి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తన కుమార్తెకు న్యాయం జరగాలని ఆమె పదేపదే ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఒక రకంగా సువేందు అధికారి కంటే కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఈమె చూపించారు. పైగా నరేంద్ర మోడీ నిర్వహించిన ఎన్నికల సమావేశాలలో ఈమె గురించి పదే పదే ప్రస్తావించేవారు. రత్న ప్రచారానికి అక్కడి నియోజకవర్గ ప్రజలు ఫిదా అయిపోయారు. పైగా ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను బిజెపి వెస్ట్ బెంగాల్ ఐటీ సెల్ విపరీతంగా ప్రచారం చేసింది. దీంతో ఆమె విజయం దాదాపుగా ఖాయం అయిపోయింది. టిఎంసి అభ్యర్థి తీర్థంకర్ మీద అద్భుతమైన విజయాన్ని సాధించింది..

బెంగాల్ బిజెపి తీసుకున్న నిర్ణయాలలో రత్నకు టికెట్ ఇవ్వడం అత్యంత గొప్పదని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానించారంటే.. ఈసారి బిజెపి నాయకత్వం వెస్ట్ బెంగాల్ విషయంలో ఎటువంటి అడుగులు వేసిందో అర్థం చేసుకోవచ్చు. రత్న మాట్లాడిన మాటలు బెంగాల్ ఓటర్లను ఆలోచింపజేశాయి. మరొకసారి మమతకు అధికారాన్ని ఇస్తే బెంగాల్ మరింత నాశనం అవుతుందని ఓటర్లకు అర్థమైంది. అందువల్లే బెంగాల్ ఓటర్లు ఈసారి మార్పు కోరుకున్నారు. బిజెపికి ఏకపక్షంగా ఓట్లు వేసి తమ ఆగ్రహాన్ని ఈ రూపంలో తీర్చుకున్నారు. సాధారణంగా బెంగాల్ బిజెపి కి తగ్గడం వెనక అధికారి ఉన్నారని అనుకుంటున్నారు. కానీ దాని వెనుక రత్న లాంటి సాధారణ మహిళ ఆగ్రహం కూడా ఉందని.. ఆమె ఆవేదన బెంగాల్ ఓటర్లకు అర్థమైందని.. అందువల్లే ఇలాంటి తీర్పు ఇచ్చారని చాలామందికి తెలియదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper