Homeజాతీయ వార్తలుTrisha viral video on Vijay party: విజయ్ పార్టీ పెట్టకముందే.. TVK ఏర్పాటుపై త్రిష...

Trisha viral video on Vijay party: విజయ్ పార్టీ పెట్టకముందే.. TVK ఏర్పాటుపై త్రిష హింట్.. వైరల్ వీడియో

Trisha viral video on Vijay party: విజయ్, త్రిష సంబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వారిద్దరు తమ బంధం గురించి పరోక్షంగా చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయ వ్యవహారాలు మొత్తం త్రిష చూసుకుంటున్నారని తెలుస్తోంది.. ఆల్రెడీ సోమవారం ఫలితాల విడుదలకు ముందు త్రిష తన జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుమల వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డు ప్రసాదం తీసుకొని నేరుగా చెన్నై వచ్చేశారు. చెన్నైలో విజయ్ ఇంటికి వెళ్లి […]

Trisha viral video on Vijay party: విజయ్, త్రిష సంబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వారిద్దరు తమ బంధం గురించి పరోక్షంగా చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయ వ్యవహారాలు మొత్తం త్రిష చూసుకుంటున్నారని తెలుస్తోంది.. ఆల్రెడీ సోమవారం ఫలితాల విడుదలకు ముందు త్రిష తన జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుమల వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డు ప్రసాదం తీసుకొని నేరుగా చెన్నై వచ్చేశారు. చెన్నైలో విజయ్ ఇంటికి వెళ్లి పోయారు. ఆయనకు తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేశారు.

గతంలో చెప్పినట్టుగానే తమిళనాడు రాజకీయాలలో త్రిష ఇప్పుడు కీలకపాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఆమె కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఈ సమావేశంలో ఏం చర్చించారు.. ఏ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.. వాటిని పక్కన పెడితే త్రిష తన రాజకీయ భవిష్యత్తును బలంగా నిర్మించుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలలో జానకి, జయలలిత వంటి వారు పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాడు ఎంజీఆర్, జయలలిత మధ్య ఎటువంటి బంధం ఉందో.. నేడు విజయ్, త్రిష మధ్య కూడా అటువంటి బంధమే ఉంది. కాకపోతే దీనిని ఇంతవరకు వారు అధికారికంగా ప్రకటించలేదు.

విజయ్ రాజకీయ ప్రస్తానాన్ని ఆయన అధికారికంగా ప్రకటించక ముందే.. త్రిష బయటపెట్టారు. లియో సినిమా తర్వాత విజయ్, త్రిష ది గోట్ సినిమాలో నటించారు. ఇందులో మట్ట అనే ఒక పాట ఉంటుంది. అందులో విజయ్, త్రిష గిల్లి సినిమాలో మాదిరిగా స్టెప్పులు వేశారు. అందులో త్రిష పసుపు, ఎరుపు రంగు కలబోతతో ఉన్న చీరను ధరిస్తారు.. యాదృచ్ఛికంగా ఆ చీర రంగులలోనే టీవీ కే అధికారిక జెండా ఉండడం విశేషం. టీవీ కే జెండా పసుపు, ఎరుపు రంగు కలబోతతో ఉంటుంది. విజయ్ రాజకీయ భవిష్యత్తు గురించి త్రిష అప్పుడే ఇచ్చారని తెలుస్తోంది.

ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీ వీ కే పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో అభిమానులు మట్ట సాంగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. “అందరూ దానిని ఒక పాటలాగానే చూశారు. కానీ అందులో త్రిష సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. పసుపు, ఎరుపు రంగు కలబోతతో ఉన్న ఆ చీరను మామూలుగా చూడొద్దని త్రిష చెప్పకనే చెప్పారు. ఇప్పుడు అది తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిపోయింది. త్రిష హింట్ ఇన్నాళ్లకు అర్థమైందని” సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper