Homeజాతీయ వార్తలుRahul Gandhi: అమెరికాతో డీల్.. ఎప్ స్టీన్ ఫైల్స్.. ప్రతిపక్షనేతగా రాహుల్ ఇక్కడే ఫెయిల్

Rahul Gandhi: అమెరికాతో డీల్.. ఎప్ స్టీన్ ఫైల్స్.. ప్రతిపక్షనేతగా రాహుల్ ఇక్కడే ఫెయిల్

Rahul Gandhi: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గడచిన దశాబ్ద కాలంగా బలమైన ప్రతిపక్ష నాయకుడిని పొందలేకపోయింది. పాలనాపరమైన వైఫల్యాలను ఎండగట్టాల్సిన ప్రతిపక్ష నాయకుడు విసిటింగ్ ప్రొఫెసర్ లాగా.. పార్ట్ టైం రాజకీయాలు చేయడం వల్ల అధికార పార్టీకి ప్రతిదీ కూడా కేక్ వాక్ లాగా మారిపోతుంది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అంది పుచ్చుకోవడం లేదు. ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ తనలో రాజకీయ పరిపక్వతను ప్రదర్శించకపోవడంతో ఎప్పటికప్పుడు బిజెపి […]

Rahul Gandhi: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గడచిన దశాబ్ద కాలంగా బలమైన ప్రతిపక్ష నాయకుడిని పొందలేకపోయింది. పాలనాపరమైన వైఫల్యాలను ఎండగట్టాల్సిన ప్రతిపక్ష నాయకుడు విసిటింగ్ ప్రొఫెసర్ లాగా.. పార్ట్ టైం రాజకీయాలు చేయడం వల్ల అధికార పార్టీకి ప్రతిదీ కూడా కేక్ వాక్ లాగా మారిపోతుంది.

వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అంది పుచ్చుకోవడం లేదు. ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ తనలో రాజకీయ పరిపక్వతను ప్రదర్శించకపోవడంతో ఎప్పటికప్పుడు బిజెపి లాభపడుతోంది. క్లిష్టమైన సందర్భాలలో కూడా సులువుగా బయటపడగలుగుతోంది.

బుధవారం రాహుల్ గాంధీ పార్లమెంట్లో సుదీర్ఘంగా ప్రసంగించారు. దేశాన్ని అమ్మేశారు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అమెరికా దేశంతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంపై మండిపడ్డారు. కానీ, ఇదే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిరోజుల క్రితం అమెరికా ప్రభుత్వం భారత్ పై టారిఫ్ లు విధించింది. ఆ సమయంలో నరేంద్ర మోడీ పూర్తిగా విఫలమయ్యారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పుడు నరేంద్ర మోడీ వాణిజ్య చాకచక్యాన్ని ప్రదర్శించడంతో అమెరికా దిగివచ్చింది. ప్రపంచంలో తొలిసారిగా మనమీద టారిఫ్ లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

అమెరికా టారిఫ్ లు తగ్గించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త పల్లవి అందుకుంది. వాస్తవానికి ఈ డీల్ కంటే ముందు యూరోపియన్ యూనియన్ తో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒకరకంగా అమెరికా అవసరం లేకుండానే బిజినెస్ విషయంలో సరికొత్త మార్కెట్ ను భారత్ రూపొందించుకుంది. ఎప్పుడైతే యూరప్ తో డీల్ కుదిరిందో ఆ తర్వాత అమెరికా కాళ్ల బేరానికి వచ్చింది. ఇదంతా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాటిని పట్టించుకోవడం లేదు. పైగా లేని పోని రాద్ధాంతం చేస్తోంది.

ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టాల్సిన రాహుల్ గాంధీ.. చవక బారు విమర్శలు చేయడం.. నిండు పార్లమెంట్లో తర్కం లేని మాటలు చెప్పడం ద్వారా అభాసు పాలవుతున్నారు.

చమురు కొనుగోలు విషయంలో భారత్ ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుగోలు చేస్తుంది. రష్యా వద్ద చమురు కొనుగోలు చేపడతామని ఇప్పటికే భారత్ ప్రకటించింది. అలాంటప్పుడు రాహుల్ గాంధీ అలాంటి విమర్శలు ఎలా చేస్తారు? అప్పట్లో మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాతో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అక్రమాలకు పాల్పడిందో అందరికీ తెలుసు. అలాంటి వాటిని కూడా పక్కనపెట్టి రాహుల్ గాంధీ ఇప్పుడు కేంద్రంలో ఉన్న బిజెపి పై ఇలాంటి విమర్శలు చేయడం నిజంగా సిగ్గుచేటు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ట్రేడ్ డీల్ అనేది పూర్తిగా వ్యాపారం మీద కేంద్రీకృతమై ఉంటుంది. అలాంటప్పుడు అందులో ఉన్న ఒప్పందాల గురించి తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడటం రాహుల్ గాంధీ అపరిపక్వతకు నిదర్శనమని బిజెపి నేతలు అంటున్నారు. ఎప్ స్టీన్ ఫైల్స్ విషయంలో కూడా రాహుల్ గాంధీ ఏవేవో మాటలు మాట్లాడారు. అవి కూడా ఆయనను మరోసారి అభాసుపాలు చేశాయి. ఈ పరిణామాలు మొత్తం చూస్తుంటే రాహుల్ గాంధీ రాజకీయాలను ఇంకా నేర్చుకోవాలని.. దేశానికి సంబంధించిన విధానాల విషయంలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper