spot_img
Homeజాతీయ వార్తలుPM Modi RDI Found: లక్ష కోట్లతో దేశానికి కొత్త దిశ.. సైన్స్‌ విప్లవానికి మోదీ...

PM Modi RDI Found: లక్ష కోట్లతో దేశానికి కొత్త దిశ.. సైన్స్‌ విప్లవానికి మోదీ శ్రీకారం

PM Modi RDI Found: భారత దేశంలో అతిపెద్ద లోపం రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌. 75 ఏళ్లు దేశాన్ని పాలించిన పాలకులు దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు.. పరిశోధనల్లో 90 శాతం విఫలం అవుతాయి. దీంతో పెట్టుబడి వృథా అన్న భావనతో డబ్బులు కర్చు చేయలేదు. కానీ అమెరికా, యూరప్‌ వంటి దేశాలు పరిశోధలనపై ఎక్కువ దృష్టి పెట్టాయి. దీంతో ఇప్పుడు లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి. మన దేశంలో పరిశోధనలకు అవకాశం లేకపోవడంతో భారత ప్రతిభ విదేశాలకు వెళ్తోంది. అమెరికా, చైనా లాంటి దేశాలు ప్రభుత్వ సహకారంతో పరిశోధనలను లాభదాయక వ్యాపారాలుగా మార్చుకున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, టెస్లా వంటి విజయవంతమైన సంస్థలు అన్నీ పరిశోధన ప్రాజెక్టుల నుంచే పుట్టాయి.

మోదీ కీలక నిర్ణయం..
దేశంలో పరిశోధన వాతావరణాన్ని సమూలంగా మార్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ చారిత్రాత్మకంగా లక్ష కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిధులు ప్రైవేటు, ప్రభుత్వ, విద్యాసంస్థల మధ్య సాంకేతిక భాగస్వామ్యానికి మద్దతు ఇస్తాయి. దీని ద్వారా స్వదేశీ ఇన్నోవేషన్‌కి ఆర్థిక రక్షణ లభిస్తుంది. అత్యాధునిక పరిశోధనలకు అవరోధాలు తగ్గితే దేశీయ ప్రతిభ తిరిగి భారత్‌లోనే అవకాశాలు కల్పించుకుంటుంది. ఈ నిర్ణయం శాస్త్రవేత్తల వలస సమస్యను తగ్గించేందుకు ముందడుగుగా భావించవచ్చు. అందులో భాగంగా విద్యా సంస్థల్లో పరిశోధనా హబ్‌లు, ప్రైవేటు కంపెనీలకు పన్ను రాయితీలు లాంటి చర్యలు ప్రోత్సాహకంగా ఉంటాయి.

ప్రభుత్వ ధైర్యం..
పరిశోధనల్లో పెట్టుబడులు పెట్టడం తక్షణ ఫలితాలను ఇవ్వదు. పది ప్రాజెక్టుల్లో ఒకటి లేదా రెండు మాత్రమే విజయవంతం అవుతాయి. అయినప్పటికీ దీర్ఘకాల దృష్టితో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడం ఆర్థిక సార్వభౌమత్వానికి పునాది వేస్తుంది. మోదీ ప్రభుత్వం ఈ దిశలో చూపిన ధైర్యం భవిష్యత్‌ భారత్‌ టెక్నాలజీ శక్తిని నిర్ణయించవచ్చు.

రాబోయే పదేళ్లలో ఈ లక్ష కోట్ల రూపాయల వ్యూహం స్థిరంగా అమలైతే భారత్‌ పరిశోధనా రంగంలో ప్రపంచ పటంలో నాయకత్వం సాధించే అవకాశం ఉంది. ‘‘ఇన్నోవేషన్‌ భారత్‌’’ అనే కొత్త భావనకు ఇది ఆద్యాయం అవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper