Homeజాతీయ వార్తలుPakistan Army Chief Asim Munir: ఇస్లామాబాద్‌ బాంబు పేలుళ్ల వెనక పాక్‌ ఆర్మీ చీఫ్‌...

Pakistan Army Chief Asim Munir: ఇస్లామాబాద్‌ బాంబు పేలుళ్ల వెనక పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌.. పెద్ద కథే

Pakistan Army Chief Asim Munir: నవంబర్‌ 10, 2025 ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని మెట్రో రైల్వే స్టేషన్‌ వద్ధ భారీ పేలుడు జరిగింది. 12 మంది మరణించారు. ఆత్మాహుతి దాడా.. లేక ప్రమాదవశాత్తు జరిగింఆ అనే దర్యాప్తు జరుగుతోంది. ఈ తరుణంలో పాకిస్తాన్‌లోని అహ్మదాబాద్‌ ప్రాంతంలో నవంబర్‌ 11న చోటుచేసుకున్న భయానక పేలుడు దేశ ప్రజలను కుదిపేసింది. ఈ దాడిలో 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ ఘటన వెనుక పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ ఉన్నట్లు తెలిసింది.

ఉవ్రాద ముసుగులో..
పాకిస్తాన్‌ సైనికాధ్యక్షుడు ఆసిమ్‌ మునీర్‌ ఈ పేలుడును రాజకీయ ప్రయోజనాల కోసం మలిచినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెహ్రీక్‌–ఏ–తాలిబాన్‌ దాడిగా ప్రచారం చేస్తూ, భారతదేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద ముప్పును తమ దేశం కూడా ఎదుర్కొంటోందని ప్రపంచానికి చూపాలనే ప్రయత్నంగా ఇది పరిగణిస్తున్నారు. ఈ విధంగా మునీర్‌ దేశీయ, అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ ‘ఉగ్రవాద బాధితదేశం‘గా నిలబెట్టే వ్యూహం అమలు చేస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం.

నెపం భారత్‌పై నెట్టేందుకే..
ఈ ఘటనతో సమీప కాలంలో భారత్‌లో జరిగిన పేలుళ్లను పాకిస్తాన్‌ ముసుగులో నడిపించిందనే అనుమానాలు మరింత బలపడ్డాయి. పాకిస్తాన్‌ ప్రధాని కూడా ఇటీవల భారత్, ఆఫ్గానిస్తాన్‌లో తెహ్రీక్‌–ఏ–తాలిబాన్‌ కార్యాచరణలపై వ్యాఖ్యానించి, తాము కూడా ‘బాధితులు‘మని చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి.
ఈ వ్యాఖ్యలు, ఇప్పుడు అహ్మదాబాద్‌ దాడి నేపథ్యంలో, పాకిస్తాన్‌ అంతర్గత రహస్య ప్రణాళికలను బహిర్గతం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. భారత్‌ అధికార వర్గాలు ఈ ఘటనను బాగా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. పాకిస్తాన్‌ ఉగ్రవాద ప్రోత్సాహకగా వ్యవహరించిందని తేలితే, భారత్‌ తీసుకునే చర్యలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. భారత్‌ భద్రతా సంస్థలు ఇప్పటికే ఈ ఘటన వెనుక అంతర్జాతీయ లింకులను విశ్లేషిస్తున్నాయి.

మునీర్‌ వ్యూహం వైఫల్యం?
ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న పేరుతో పాకిస్తాన్‌ ప్రభుత్వానికి సానుభూతి సంపాదించడం మునీర్‌ లక్ష్యంగా ఉన్నప్పటికీ, ఈ దాడి ప్రపంచ దృష్టిని తిరిగి పాకిస్తాన్‌ పైకి మళ్లించిందనే వాస్తవం తప్పించుకోలేనిది. ఇది దేశంలో మతపరమైన తీవ్రవాదం ఇంకా కట్టడి కాలేదనే సంకేతాన్నిచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular