Delhi and Islamabad blasts: భారత్ మీద నిత్యం పాకిస్తాన్ విషం చిమ్ముతూనే ఉంటుంది. సరిహద్దుల్లో నిత్యం రగడ సృష్టిస్తూనే ఉంటుంది. మారణ హోమాన్ని రగిలించడంలో పాకిస్తాన్ ఎప్పటికప్పుడు అనేక దుర్మార్గాలకు పాల్పడుతూనే ఉంటుంది. ఇందుకోసం అమాయకులను బలి చేస్తూనే ఉంటుంది. పాకిస్తాన్ కేంద్రంగా అనేక ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ప్రభుత్వం షెల్టర్ ఇస్తూ ఉంటుంది. వారి మీద ఈగ కూడా వాలనివ్వదు.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ చేసిన దాడుల వల్ల పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు బయట ప్రపంచానికి తెలిసాయి. మూడో కంటికి తెలియకుండా భారత్ ఈ స్థావరాలను మొత్తం నేలమట్టం చేసింది. అయితే ఊహించని విధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జై షే మహమ్మద్ లో పనిచేస్తున్న కొంతమంది వైట్ కాలర్ ఉగ్రవాదులు మనదేశంలో పెద్ద కుట్రకు తెర లేపారు. ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం కావడంతో మనదేశానికి భారీ నష్టం తప్పింది. అయితే ఉగ్రవాదుల రూపొందించిన మాడ్యూల్ వల్ల ఇప్పటికి మన దేశానికి ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు అంటున్నాయి.
ఢిల్లీలో జరిగిన పేలుడు తర్వాత పాకిస్తాన్లో కూడా పేలుడు చోటుచేసుకుంది. ఒకరోజు వ్యవధిలో ఈ దారుణం జరగడంతో అయోమయం నెలకొంది. ఢిల్లీలో జరిగిన పేలుడు తర్వాత అన్ని వేళ్ళు పాకిస్తాన్ వైపు చూపించాయి. అయితే పాకిస్తాన్ సైనిక పాలకుడు అసీం మునీర్ అత్యంత తెలివిగా తన దేశంలో పేలుడు జరిపించాడు.. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు చనిపోయారు.. వారంతా కూడా మునీర్ మీద వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయడానికి వెళ్తున్నారు.. వారు కేసులు పెట్టి వస్తున్న క్రమంలో.. వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చనిపోయారు.. ఈ దారుణానికి భారత్ పాల్పడిందని మునీర్ ఆరోపించడం మొదలుపెట్టాడు.. వాస్తవానికి మునిర్ వ్యవహార శైలి వల్ల భారత్ తీవ్రంగా ఇబ్బంది పడుతూనే ఉంది.