Trishul to Bhadra: సరిహద్దుల్లో డ్రాగన్ కుయుక్తులు పన్నుతోంది. భారత సైనికులను తిప్పలు పెట్టేందుకు పలు కోణాల్లో ఆయుధాలు తయారు చేసుకుంటోంది. దీంతో మన దేశం మీద ఆధిపత్యం చెలాయించాలని కలలు కంటోంది. ఇందులో భాగంగా పలు మార్గాల్లో కుట్రలకు తెర తీస్తోంది. ఇప్పటికే లడ్డాఖ్ వంటి చోట్ల చైనా సైనికులు మన వారిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ కూడా దానికి ధీటుగా స్పందించేందుకు సిద్ధమైంది. వారి ఆగడాలను తిప్పికొట్టే క్రమంలో భారత సైనికులు కూడా రాటుదేలారు.

డ్రాగన్ సైనికులను ఎదుర్కొనే విధంగా ఆయుధాల తయారీకి మన దేశం కూడా పచ్చజెండా ఊపింది. భారత బలగాలకు పదునైన ఆయుధాలు ఇచ్చేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా వాటిని తయారు చేసింది. కొత్తగా తయారు చేసిన గ్లౌసులతో పంచ్ ఇస్తే ఇక ఎదుటి వ్యక్తికి చుక్కలు కనబడతాయి. కిందపడి గిలగిల కొట్టుకోవాల్సిందే. అంతటి పదునైన ఆయుధాలను భారత్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
లద్దాఖ్ లో భారత సైనికులను 20 మందిని పొట్టన పెట్టుకున్న డ్రాగన్ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో సైనికులకు మంచి పట్టున్న ఆయుధాలు సరఫరా చేసేందుకు సిద్ధమైంది. శివుడి చేతిలో త్రిశూలాన్ని మన సైనికులకు సంప్రదాయ ఆయుధాల్లో భాగంగా అందజేసింది. దీంతో ప్రత్యర్థిని కొన్ని సెకన్లలోనే మట్టుబెట్టే పని మన సొంతం. దీంతో భారత సైనికులు స్వేచ్ఛగా సరిహద్దులో కాపలా కాసే అవకాశం ఏర్పడింది.
శత్రువును సమర్థంగా ఎదుర్కొనే వజ్ర ఆయుధాన్ని కూడా సైనికులకు దగ్గర చేసింది. దీంతో శత్రువును అపస్మారక స్థితిలోకి పంపించే ఆయుధం దీనిపై ముళ్లు లాంటి ఆకృతులు ఉండడంతో శత్రువుల వాహనాలు, ఆయుధాలు నాశనం చేసే సత్తా కలిగి ఉంది. దీంతో భారత సైనికులకు మనోనిబ్బరం పెరుగుతోంది. ప్రత్యర్థులను మట్టుబెట్టగలమనే నమ్మకం వారిలో క్రమంగా కలుగుతోంది.
భారత్ కూడా తన సైనికులకు రక్షణ కలిగించే ఆయుధాల తయారుపై ప్రత్యేక దృష్టి సారించింది. డ్రాగన్ కుయుక్తులను దెబ్బతీసే క్రమంలో మనం కూడా మేల్కోవాల్సిందే అని గుర్తించింది. అది చేస్తున్న దురాగాతాలను ఎండగట్టే క్రమంలో మనం కూడా మారాల్సిందే. ఇందుకోసం మన ఆయుధ సంపత్తిని కూడా పెంచుకోవల్సిందే. ఇందు కోసమే భారత్ పలు ఆయుధాలు తయారు చేసి సైనికులకు అందజేసింది.