MK Stalin Modi: ఊరికే రారు మహానుభావులు అన్నట్టు ఎప్పుడూ మోడీని తిట్టే తమిళనాడు సీఎం ఉన్న ఫళంగా ఢిల్లీ వచ్చి మోడీని కలవడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. సమ్ థింగ్ ఈజ్ రాంగ్ అని అందరూ ఆరాతీయడం మొదలుపెట్టారు. ఆరాతీస్తే నిజంగానే ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. ఎంకే స్టాలిన్.. తమిళనాడులో అధికారంలోకి వచ్చాక పలు ప్రజా ప్రయోజన కార్యక్రమాలతో ప్రజల్లో పాపులర్ అయ్యారు. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వతహాగా కాంగ్రెస్ వాది అయిన స్టాలిన్.. బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతుంటారు. ఇటీవల మోడీ సమక్షంలోనే ఆయనను రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని నిలదీశారు. మోడీ అంటేనే తీవ్రంగా వ్యతిరేకిస్తారు.

అలాంటి స్టాలిన్.. ఉన్న ఫళంగా ఢిల్లీ వెళ్లాను. ప్రధానమంత్రిని స్టాలిన్ కలిసి మంతనాలు జరిపారు. ఈ డిఎంకె అధినేత అధికారిక పర్యటన వెనుక కారణం పైకి చెప్పేది ఒకటి.. లోపల ఇంకొకటి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కొత్తగా ఎన్నికైన ఉప రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారని తమిళనాట ప్రచారం చేసినా దానివెనుక కథ వేరే ఉందని అంటున్నారు.
ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్మకు వ్యతిరేకంగా ఎంకే స్టాలిన్ ఓటువేశారు. ఆమె ఓడిపోవాలని కాంగ్రెస్ బలపరిచిన యశ్వంత్ సిన్హాకు తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఓటు వేయించారు. ద్రౌపది ముర్ము గెలిచాక ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. కానీ సడెన్ గా ఇప్పుడు ఉన్నఫళంగా ఢిల్లీకి వచ్చి ప్రధాని మోడీని కలవడం వెనుక పెద్ద స్కాం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్ లోని పన్ను మినహాయింపు ఉన్న దేశంలో స్టాలిన్ కుటుంబ పెట్టుబడులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించిందని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. పన్నులు లేని అక్కడికి భారీగా స్టాలిన్ ఫ్యామిలీ పంపిన డబ్బును లూలూ ద్వారా తిరిగి భారత్‌లోకి తీసుకురావడానికి ప్లాన్ చేశారని… దుబాయ్ నుంచి వచ్చిన 6100 కోట్ల పెట్టుబడి మొత్తం స్టాలిన్ కుటుంబానికి చెందినదని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ వర్గాలు నిగ్గు తేల్చినట్టు సమాచారం.
ఈ ప్రమాదాన్ని పసిగట్టిన తమిళనాడు సీఎం వెంటనే తన డబ్బు, పరపతి పేరు చెడకుండా వెంటనే ఢిల్లీ వెళ్లి మోడీని శరణు వేడాడని ప్రచారం సాగుతోంది. పేరుకు కొత్త రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపే నెపంతో హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు ప్లాన్ చేశారని అంటున్నారు.. బిజెపికి వ్యతిరేకంగా గళమెత్తే స్టాలిన్ తన కుటుంబం ఈ భారీ స్కాంలో ఇరుక్కోకుండా కాపాడుకోవడానికే ఢిల్లీకి వెళ్లి మోడీని శరణు కోరినట్టు మీడియాలో ప్రచారం సాగుతోంది. మోడీ మరి తమిళనాడు సీఎంను కనికరించారా? లేదా? అన్నది వేచిచూడాలి.