Vastu Dosha Remedies: వాస్తు ప్రకారం మనం ఎన్నో విధాలైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మన ఇంటిలో ఏది ఎక్కడ ఉండాలనేదానిపై వాస్తు శాస్త్రం మనకు వివరిస్తుంది. అందుకే దేశంలో వాస్తు ప్రభావం ఎక్కువగానే ఉంది. ప్రతి వారు ఇల్లు కట్టుకునే నేపథ్యంలో ఏం చర్యలు తీసుకోవాలనేదానిపై సమగ్రంగా తెసుకుంటున్నారు. వాస్తు ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో, ఏ దిక్కులో ఏముంచాలో కూడా ముందే ఆలోచిస్తున్నారు. వాస్తు ప్రకారం ఇంటికి అవసరమైన అన్ని కోణాల్లో ఆలోచించి ఇంటిని అమర్చుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనకు డబ్బు నిలుస్తుంది? ఆదాయం పెరుగుతుంది? ఏ బాధలు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలనేదానిపై వాస్తు శాస్త్రం పలు మార్గాలు సూచిస్తోంది.

మన ఇంటిలో డబ్బు బాగా నిలవాలంటే కుబేరుడి విగ్రహం ఉండాల్సిందే. ఇంటి ఈశాన్య భాగంలో కుబేరుడి యంత్రం ఉంచి పూజించాలి. ఈశాన్య దిక్కులో ఎలాంటి వస్తువులు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటే కుబేర యంత్రం ఉంచుకునేందుకు ప్రయత్నించండి. ఈశాన్య దిక్కులో కుబేర యంత్రం ఉంచుకుంటే అన్ని లాభాలు జరుగుతాయని తెలుస్తోంది. ఈశాన్య దిశలో ఎలాంటి బరువులు కూడా ఉంచకూడదు. మనకు ఎలాంటి నష్టాలు రాకుండా చూసుకోవాలంటే ఈశాన్యమే ప్రధానం.
లాకర్ ను కూడా సరైన దిక్కులో ఉంచుకోవాలి. వాస్తు ప్రకారం మన లాకర్ ను దక్షిణం, పడమర వైపు తెరవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మనకు డబ్బు నిలవదు. ఇబ్బందులు వస్తాయి. బీరువా నైరుతి దిశలో అమర్చుకుంటే ప్రయోజనం కలుగుతుంది. వాస్తు ప్రకారం చూసుకోకపోతే నష్టం భారీగానే ఉంటుంది. డబ్బు, నగదు, నగలు నిల్వ ఉంచుకునే చోటు కూడా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోండి. సరైన దిక్కులో ఉంచుకోకపోతే ఇబ్బందులు రావచ్చని తెలుసుకోండి.
ప్రవేశ ద్వారాలు కూడా బాగా ఉండేలా చూసుకోండి. తలుపులకు ఎలాంటి గీతలు ఉండకూడదు. ఎటువంటి పగుళ్లు కూడా కనిపించకూడదు. తలుపులు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోండి. ప్రధాన ద్వారం బాగుండేలా చర్యలు చేపట్టండి. ద్వారాల దగ్గర నేమ్ ప్లేట్ , విండ్ చైన్ లు వంటివి వేలాడదీస్తే కూడా లాభాలు ఉంటాయి. వాస్తు ప్రకారం అన్ని చిట్కాలు పాటించి ఇంటి ద్వారాలు బాగుండేలా చూసుకుని ఇంటికి ఎలాంటి నష్టాలు రాకుండా చూసుకోవడం మంచిది.

వాటర్ ఫౌంటేషన్, అక్వేరియంలు ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి. మనకు డబ్బు బాగా నిలవాలంటే ఈశాన్య భాగంలోనే వీటిని అమర్చుకునేలా జాగ్రత్తలు పడండి. వీటిని ఉంచుకుంటే ధన ప్రవాహం పెరుగుతుందని తెలిసిందే. దీంతో వాస్తు ప్రకారం డబ్బు బాగా రావాలంటే చిట్కాలు పాటించాల్సిందే. ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా ఈశాన్యం లేదా ఆగ్నేయం మూలలో ఉంచకుండా చూసుకోండి. దీంతో మీకు అనర్థాలు వస్తాయి. ఇలా చేస్తే ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. వాస్తు నిపుణుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుని వాస్తు పద్ధతులు పాటించాల్సిందే.