2002 Gujarat Riots: కేసులు.. కొట్లాటలు అంటే మొదట బాగానే అనిపించినా.. ఆ తర్వాత రోజులు గడిచేకొద్దీ అంతకుమించిన బాధ మరొకటి ఉండదు. దాన్ని భరించడం చాలా కష్టం. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లడం.. కేసులను కోర్టుల్లో ఎదుర్కోవడం అదొక పెద్ద బాధ. అధికారంలో ఉన్న వాళ్లు ప్రతిపక్షాలను వేధించడం ఈ కేసులతోనే.. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ పై కేసులు పెట్టి జైలుకు పంపింది. అమిత్ షాను జైల్లో నెట్టింది. మోడీని గోద్రా అల్లర్లలో ఇరికించింది.

ప్రధాని మోడీ 19 ఏళ్ల క్రితం గుజరాత్ సీఎంగా ఉండంగా జరిగిన అల్లర్లలో 60మందికి పైగా ఒక వర్గం వారు చనిపోయారు. ఈకేసులో మోడీపై కూడా నాటి కాంగ్రెస్ కేంద్రప్రభుత్వం కేసులు పెట్టింది. ఆ అల్లర్ల కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో నడుస్తోంది. తాజాగా ఆ కేసుల నుంచి మోడీకి విముక్తి కలిగింది. కాంగ్రెస్ పెట్టిన కేసులన్నీ కొట్టుడుపోయాయి.
మోడీకి అంతరంగికుడు.. దగ్గరి అనుంగ శిష్యుడు అయిన అమిత్ షా మోడీ పడిన ఆవేదనను కళ్లకు కట్టాడు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్రమోడీ సహా 62మందికి శుక్రవారం సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో మోడీ స్పందించకున్నా.. హోంమంత్రి అమిత్ షా మాత్రం స్పందించాడు.
మోడీ తనపై వచ్చిన ఆరోపణలపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాధను దిగమింగుకున్నారని.. మోడీ పడిన బాధను తాను దగ్గరి నుంచి చూశానని అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్ అల్లర్లపై విషప్రచారం చేశారని.. తనపై వచ్చిన ఆరోపణలపై 19 ఏళ్లుగా మోడీ ఒక్క మాట మాట్లాడలేదని.. శివుడు తన గొంతులో విషాన్ని నింపుకున్నట్లుగా మోడీ కూడా ఆ బాధను దిగమింగారని తెలిపారు. మోడీ పడుతున్న బాధను తాను చాలా దగ్గరి నుంచి చూశానని అమిత్ షా చెప్పుకొచ్చారు.

గుజరాత్ అల్లర్లపై మోడీ ఇంతవరకూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎన్ని ఆరోపణలు చేసినా మౌనంగా ఉన్నారు. కోర్టులోనే ఎదుర్కొన్నారు. 19 ఏళ్లకు మోడీ ఇప్పుడు ఈ ఆరోపణల నుంచి విముక్తి పొందారు.
అయితే ఎంత సర్దిచెప్పుకున్నా కానీ బీజేపీ పాలనలో అల్లర్లు చెలరేగి మైనార్టీలు హత్యకు గురికావడం బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసింది. కానీ ఇప్పుడది తొలిగిపోవడం.. మోడీకి ఊరట కలిగించింది. ఎన్నాళ్ల నుంచో వేధిస్తున్న ఈ సమస్య పరిష్కారమైంది.అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఈ తీర్పు రావడంతో మోడీని కార్నర్ చేసే వారు లేకపోలేదు. ఏది ఏమైనా కేసు నుంచి మోడీ సేఫ్ గా బయటపడి ఊపిరిపీల్చుకున్నారు.
Also Read:Prudhvi Raj Open Heart With Rk: ఆర్కే పృధ్వీని వైసీపీపై బాంబుగా ప్రయోగిస్తున్నారా?