Homeజాతీయ వార్తలుModi diplomacy Global AI Summit: మోడీ అంటే అంతే మరి.. బిత్తర పోయిన శామ్...

Modi diplomacy Global AI Summit: మోడీ అంటే అంతే మరి.. బిత్తర పోయిన శామ్ ఆల్ట్ మన్!

Modi diplomacy Global AI Summit: రాజకీయాలు చేయడంలోనే కాదు.. వ్యూహాత్మకంగా వ్యవహరించడంలోనూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందు వరుసలో ఉంటారు. ప్రత్యర్థులకు అర్థం కాని విధంగా రాజకీయ చాణక్యాలను ప్రదర్శించడంలో.. మోడీ చతురత కొనసాగిస్తూ ఉంటారు. ఇక విదేశాలతో సంబంధాలు కొనసాగించడంలో మోడీ తర్వాతే ఎవరైనా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనమీద లేనిపోని టారిఫ్ లు విధించినప్పుడు నరేంద్ర మోడీ ఏమాత్రం ఖండించలేదు. మరో మాటకు తావు లేకుండా.. యూరోపియన్ యూనియన్ తో వ్యాపార […]

Modi diplomacy Global AI Summit: రాజకీయాలు చేయడంలోనే కాదు.. వ్యూహాత్మకంగా వ్యవహరించడంలోనూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందు వరుసలో ఉంటారు. ప్రత్యర్థులకు అర్థం కాని విధంగా రాజకీయ చాణక్యాలను ప్రదర్శించడంలో.. మోడీ చతురత కొనసాగిస్తూ ఉంటారు.

ఇక విదేశాలతో సంబంధాలు కొనసాగించడంలో మోడీ తర్వాతే ఎవరైనా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనమీద లేనిపోని టారిఫ్ లు విధించినప్పుడు నరేంద్ర మోడీ ఏమాత్రం ఖండించలేదు. మరో మాటకు తావు లేకుండా.. యూరోపియన్ యూనియన్ తో వ్యాపార సంబంధాలు మొదలుపెట్టాడు. దెబ్బ ట్రంప్ దిగివచ్చాడు. అంతేకాదు టారిఫ్ లు తగ్గిస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో నరేంద్ర మోడీ చాణక్యం ఎలా ఉంటుందో ప్రపంచానికి మరోసారి అర్థమైంది.

అప్పట్లో పాకిస్తాన్ విషయంలో కూడా నరేంద్ర మోడీ ఇదే దూకుడు కొనసాగించారు. సింధూ నది జలాలు వదలకుండా అడ్డుకట్ట వేశారు. సరిహద్దుల్లో భద్రతను మరింత పెంచారు. పెద్ద నోట్ల రద్దు చేసి.. నల్లధనం మీద దెబ్బ కొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ రచించిన వ్యూహాలు.. అనుసరించిన పద్ధతులు.. ప్రత్యర్థులకు ఏమాత్రం అర్థం కావు. ఎంత మాత్రం కొరుకుడు పడవు.

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఏ ఐ గ్లోబల్ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 100 దేశాలకు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. సమిట్లో ఓపెన్ ఏఐ సీఈవో శ్యామ్ ఆల్ట్ మన్, ఆంత్రో పిక్ సీఈవో డార్యో అమోడి ప్రత్యేకంగా నిలిచారు. ఈ రెండు సంస్థలు కూడా ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించడానికి వినూత్నమైన విధానాలను ఆవిష్కరిస్తున్నాయి. అయితే ఈ రెండు సంస్థల సీఈవోల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అంతటి అమెరికా అధ్యక్షుడికి కూడా వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడం చేతకాలేదు. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నరేంద్ర మోడీ బలమైన అడుగు వేశారు..

ఏఐ సమ్మిట్ లో పాల్గొనడానికి వచ్చిన ఆల్ట్ మన్, డార్యో అమోడీ మధ్య సయోధ్య కుదుర్చడానికి నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. సమ్మిట్ లో వేదిక పైకి వచ్చిన నరేంద్ర మోడీ అందరితో చేతులు కలిపి అభివాదం చేశారు. కానీ ఆల్ట్ మన్, డారియో అమ్మోడీ చేతులు పట్టుకొని నరేంద్ర మోడీ పైకి లేపారు. వాస్తవానికి సమ్మిట్ లో నరేంద్ర మోడీ చేతులు పైకి లేపుతున్నప్పుడు ఆల్ట్ మన్, డారియో అమ్మోడీ చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ వారిద్దరి చేతులను పట్టుకొని పైకి లేపారు. మొదట్లో ఆల్ట్ మన్, డారియో అమ్మోడీ చేతులు పైకి లేపలేదు. దీనిపై రకరకాల విమర్శలు వచ్చాయి. దీనిపై ఆల్ట్ మన్ క్లారిటీ ఇచ్చారు.. ” నేను ఒక రకమైన తత్తరపాటుకు గురయ్యాను. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నరేంద్ర మోడీ నా చేయి పట్టుకుని పైకి లేపారు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదని” ఆల్ట్ మన్ పేర్కొన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper