Homeవింతలు-విశేషాలుTurkish Actor Burak Fan Meeting Price: అతడి కోసం.. 15 నిమిషాల పనికి 30...

Turkish Actor Burak Fan Meeting Price: అతడి కోసం.. 15 నిమిషాల పనికి 30 కోట్లు ఇచ్చింది

Turkish Actor Burak Fan Meeting Price: కొంతమందికి డబ్బును విపరీతంగా ఖర్చు పెడుతుంటారు. విలాసాల కోసం ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఐశ్వర్యవంతులలో కొంతమంది డబ్బుతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంకొంతమంది విలువైన లోహాల కోసం డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలా వారు స్థాయికి తగ్గట్టుగా విలాసాలను.. వైభోగాలను డబ్బు ద్వారా పొందుతూ ఉంటారు. టర్కీలో బురాక్ అనే నటుడు ఉన్నారు. ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అతడితో ఫోటోలు దిగాలని.. […]

Turkish Actor Burak Fan Meeting Price: కొంతమందికి డబ్బును విపరీతంగా ఖర్చు పెడుతుంటారు. విలాసాల కోసం ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఐశ్వర్యవంతులలో కొంతమంది డబ్బుతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంకొంతమంది విలువైన లోహాల కోసం డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలా వారు స్థాయికి తగ్గట్టుగా విలాసాలను.. వైభోగాలను డబ్బు ద్వారా పొందుతూ ఉంటారు.

టర్కీలో బురాక్ అనే నటుడు ఉన్నారు. ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అతడితో ఫోటోలు దిగాలని.. సరదాగా సంభాషించాలని చాలామందికి ఉంటుంది. అయితే ఆ అవకాశాన్ని దక్కించుకోవడానికి ఒక మహిళ ఏకంగా 30 కోట్లకు పైగా ఖర్చుపెట్టింది.

డబ్బు బాగున్న వారికి ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు. కాకపోతే కొందరు విలాసాలకు పెట్టే ఖర్చులు వినూత్నమైన విధానాన్ని ఆలంబిస్తారు.. తద్వారా అటు మీడియాలో.. సోషల్ మీడియాలో విశేషమైన ప్రాచుర్యాన్ని పొందుతారు. ఈ స్టోరీ కూడా అటువంటిదే. ఈ కథనంలో ఓ మహిళ పెట్టిన ఖర్చు మీడియాలో విశేషమైన ప్రాచుర్యాన్ని పొందింది. బు రాక్ కోసం ఆ మహిళ దాదాపు 30 కోట్ల వరకు ఖర్చు పెట్టింది 15 నిమిషాలపాటు అతనితో కూర్చుంది. ఈ క్రమంలో అతనితో సరదాగా సంభాషించింది.. దీనిని మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం మాదిరిగా ఆమె నిర్వహించింది.

అయితే ఆ మహిళ చేసిన పని పట్ల రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరేమో డబ్బు ఎక్కువై అలా చేసిందని అంటుంటే.. కొందరేమో ఆమె కష్టపడిన డబ్బు.. ఖర్చు పెట్టుకోవడం ఆమె ఇష్టం.. మధ్యలో కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముందని ఇంకొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక నటుడి కోసం.. అది కూడా 15 నిమిషాల పాటు అతడితో కూర్చొని మాట్లాడేందుకు 30 కోట్లు ఖర్చు పెట్టిందంటే మామూలు విషయం కాదని.. గ్లోబల్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Av News (@_av_news_)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper