spot_img
Homeఆంధ్రప్రదేశ్‌MLA Roja: రోజాకు దెబ్బ మీద దెబ్బ‌.. ఆశ‌ల‌న్నీ అడియాశ‌లే..!

MLA Roja: రోజాకు దెబ్బ మీద దెబ్బ‌.. ఆశ‌ల‌న్నీ అడియాశ‌లే..!

MLA Roja: అతిగా ఆశ‌ప‌డ‌టం కూడా కొన్ని సార్లు బాధ‌పెడుతుంది. ఇప్పుడు ఈ సామెత ఎందుకంటారా.. మ‌రేం లేదండి వైసీపీ ఫైర్ బ్రాండ్ అన‌గానే అంద‌రికీ గుర్తుకు వ‌చ్చే మ‌హిళా లీడ‌ర్‌.. ఇప్పుడు తెగ బాధ‌ప‌డిపోతున్నారంట‌. ఇంత‌కీ ఆమె ఎవ‌రో మీకు గుర్తుకొచ్చే ఉంటుంది. ఆమెనే న‌గ‌రి ఎమ్మెల్యే రోజా. వాస్త‌వానికి సీఎం మొద‌టిసారి కేబినెట్ లోనే ఆమెకు ఛాన్స్ ఇస్తార‌ని అంతా అనుకున్నారు. ఆమె అయితే త‌న అనుచ‌రుల‌తో పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా చేయించుకుంది. కానీ చివ‌ర‌కు సీన్ రివ‌ర్స్ అయింది.

MLA Roja
MLA Roja

దీంతో ఆమె అల‌క బూనింది. జ‌గ‌న్ కొంత‌మంది పార్టీ పెద్ద‌ల‌తో ఆమెను బుజ్జిగించి ఏఐసీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చి సంతృప్తిచెందేలా చేశారు. కానీ ఆమెకు ఆ ప‌ద‌వితో పూర్తి సంతృప్తి క‌ల‌గ‌లేదు. అందుకే దాన్ని ఆమె పెద్ద ప‌ద‌విగా భావించ‌లేదు. అందుకేనేమో ఆ ప‌ద‌విలో కూడా ఎక్కువ కాలం ఇమ‌డ‌లేక‌పోయింది. అయితే త‌న అంతిమ ల‌క్ష్యం అయిన మంత్రి ప‌ద‌వి రాక‌పోతుందా అని ఆశ‌గా ఎద‌రు చూసింది.

ఇప్పుడు మంత్రుల మార్పు ప్ర‌క‌టించ‌గానే ఆమెలో మ‌ళ్లీ ఆశ‌లు చెల‌రేగాయి. మొద‌టి ద‌ఫాలోనే ఉన్న ఫైర్ బ్రాండ్ నేత‌లు అంద‌రూ అయిపోయారు కాబ‌ట్టి.. రెండోసారి క‌చ్చితంగా త‌న‌కు ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకుంది. ఇక మీడియా కూడా ఆమెకే ప‌ద‌వి ఖాయం అంటూ వార్తలు ప్ర‌చురించ‌డంతో ఎగిరి గంతేసింది.

కానీ వాస్త‌వ ప‌రిస్థితులు చూస్తుంటే మాత్రం తేడా కొట్టిన‌ట్టు స‌మాచారం. ఎందుకంటే జ‌గ‌న్ రెండోసారి మంత్రి ప‌ద‌వుల మార్పులో సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో ఈసారి ఎక్కువ‌గ బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి పెద్ద పీట వేస్తున్నారంట‌. సొంత రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఈ సారి మంత్రి ప‌ద‌వుల్లో కోత త‌ప్ప‌ద‌ని తేల్చి చెప్పారంట‌.

MLA Roja
MLA Roja

దీంతో రోజా పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ అడియాశ‌లైపోయాయి. దీంతో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. మంత్రి ప‌ద‌వి కాకుండా మ‌రో ప‌ద‌వి ఇచ్చి బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేయాల‌ని జ‌గ‌న్ సూచించారంట‌. మ‌రి ఆమె రెండోసారి కూడా నిరాశ‌ను త‌ట్టుకుంటుందా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది.

రెండోసారి కూడా త‌న అనుచ‌రుల ద‌గ్గ‌ర చిన్న‌బోవ‌డంతో ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్న‌ట్టు స‌మాచారం. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎదురుతిర‌గ‌డం మంచిది కాద‌ని.. మ‌రోసారి ఛాన్స్ కోసం వెయిట్ చేయాల‌ని ఆమె స‌న్నిహితులు చెప్ప‌డంతో సైలెంట్ అయిపోయింది. మ‌రి ఆమెకు ఎలాంటి ప‌ద‌వి ఇస్తారో వేచి చూడాలి.

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Oktelugu Epaper