spot_img
Homeజాతీయ వార్తలువైరల్: కాటేసిన తాచుపాముతో ఆస్పత్రికొచ్చాడు

వైరల్: కాటేసిన తాచుపాముతో ఆస్పత్రికొచ్చాడు

వీడెవడండి బాబూ.. ఏకంగా కరిచిన పామును చేత్తో పట్టుకొని ఆస్పత్రికొచ్చాడు. ఆ పామును విడిచిపెట్టకుండా వైద్యం చేయమని డాక్టర్లను కోరాడు. ఏపాము కరిచిందో చూపించి మరీ ఆ నివారణ మందులు ఇవ్వాలని కోరాడు. ఈ హఠాత్ పరిణామానానికి స్థానికులు, వైద్యులు హడలి చచ్చారు.

కాటేసీన తాచుపామును పట్టుకొని ఆస్పత్రికొచ్చిన యువకుడిని చూసి అందరూ షాక్ అయ్యారు. అతడికి ప్రాథమిక చికిత్స అందించి జిల్లా ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లా ఉప్పరహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.

కాడప్ప అనే వ్యక్తి తన పొలంలో వ్యవసాయం చేస్తుండగా ఓ తాచుపాము అతడి ఎడమ చేతిపై కాటేసింది. వెంటనే ఆ పామును చేతితో పట్టుకొని బంధువు సాయంతో స్థానిక ఆస్పత్రికి వచ్చాడు. అక్కడి వైద్యులు అతడికి ప్రాథమిక చికిత్స చేసి జిల్లా ఆస్పత్రికి పంపారు. జిల్లా ఆస్పత్రికి కూడా పామును పట్టుకొనే వెళ్లారు.

దీంతో బళ్లారి జిల్లా ఆస్పత్రి వద్ద ఆ పామును కొందరు కొట్టి చంపారు. ప్రస్తుతం కాడెప్ప ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి మానసిక పరిస్థితి బాగాలేదని స్థానికులు తెలిపారు.

వీడియో కోసం క్లిక్ చేయండి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Bandla Ganesh

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక అయిపోయినట్టే..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి సుప్రీం కోర్టు నుండి చాలా పెద్ద ఎదురుదెబ్బ నే తగిలింది. తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని సమర్థిస్తూ...
India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Delhi Cockroach Protest

Delhi Cockroach Protest: ఢిల్లీలో కాక్రోచ్ లో నిరసన.. ముంబై, హైదరాబాద్ నుంచి ఆర్డర్లు.. ఏంటీ వింత పరిస్థితి..

Delhi Cockroach Protest: కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకున్న వారిని శిక్షించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని...
PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Oktelugu Epaper