* సౌత్ గ్రూప్ పై నిఘా పెట్టిన సిబిఐ
* లావాదేవీలపై ఆరా
* త్వరలో మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం
గతంలో కవితతో వైరల్ అయిన బుచ్చిబాబు ఫొటో
Liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక మలుపు తిరిగింది. హైదరాబాద్ కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చి బాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సంచలనం నెలకొంది. హైదరాబాద్ కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చి బాబు ఎమ్మెల్సీ కవిత మాజీ సహాయకుడు కూడా గమనార్హం. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఢిల్లీ తరలించారు. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లై కి చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చి బాబు పని చేశారు. గతంలో ఇదే కేసులో ఈడీతో పాటు సీబీఐ అధికారులు సోదాలు జరిపారు.
ఆ గ్రూప్ తో ప్రాతినిధ్యం
లిక్కర్ పాలసీ రూపకల్పన లో హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలకు భారీగా లబ్ధి చేకూరేలా బుచ్చి బాబు వ్యవహరించనట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆప్ నేతల తరఫున సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు సేకరించింది. విజయ్ నాయరే అని ఈడీ తెలిపింది. ఇక ఈ గ్రూప్ లో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి,ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్ర రెడ్డి ఉన్నారు. ఆ గ్రూపునకు అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారు. కాగా మంగళవారం సిబిఐ అధికారులు బుచ్చిబాబును ప్రశ్నించారు. విచారణ తర్వాత రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయన అరెస్టును అధికారికంగా ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరం ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో బుచ్చిబాబును పర్చనున్నారు.
మరో కీలక పరిణామం
చార్జిషీట్లో రోజుకు కొత్త పేర్లను అధికారులు చేర్చుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండో ఛార్జ్ షీట్ ను ఫైల్ చేసిన అధికారులు కీలక వ్యక్తుల పేర్లను చేర్చారు. ఛార్జ్ షీట్ లో ఈడీ అధికారులు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పేరు ప్రస్తావించారు.. అంతేకాకుండా చార్జ్ షీట్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును కూడా చేర్చారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించడంతో ఢిల్లీ లిక్కర్ స్కాం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. దర్యాప్తు సంస్థల అడుగులు వేగంగా పడుతున్న నేపథ్యంలో.. తర్వాత అరెస్టు ఎవరిది అనేది ఉత్కంఠ గా మారింది. ఈ అరెస్టుపై బిజెపి నాయకులను సంప్రదించగా… చట్టం తన పని తాను చేసుకుపోతుందని వివరించారు. అయితే ఈ కుంభకోణంలో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Liquor scam kavithas ca arrested by cbi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com