MLC Kavitha(5)
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కింగ్ పిన్‌గా కేంద్ర దర్యాప్తు సంస్థలు పేర్కొన్నా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయకు రెండు రోజుల క్రితం దేశ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టు 27న రాత్రి 9:30 గంటలకు కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వస్తూనే ఆమె పిడికిలి బిగించారు. కొడుకు, భర్త, అన్నను ఆత్మీయంగా హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం తిహార్ జైలు ఎదుటనే టాప్‌లెస్ కారులో మాట్లాడారు. తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని శపథం చేశారు. తాను కేసీఆర్ బిడ్డనని, తాను ఎలాంటి తప్పుచేయనని ప్రకటించారు. కడిగిన ముత్యంగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఇంటికి వెళ్లిన కవిత కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కూతురు ఐదు నెలలు జైల్లో ఉన్నా.. ఒక్క రోజు కూడా కేసీఆర్ ఆమెతో ములాఖత్ కాలేదు. దీంతో విడుతలైన వెంటనే ఫోన్‌చేసి మాట్లాడారు. ఇక బుధవారం(ఆగస్టు 28న) ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కవిత.. గురువారం(ఆగస్టు 29న) తండ్రిని కలిశారు.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి..
రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన కవిత తన తండ్రి, మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను గురువారం కలిశారు. హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయల్దేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫాంహౌస్‌కి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కుమారుడు కూడా ఉన్నారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఆమె తండ్రి కేసీఆర్‌ను కలవగానే ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కూతురును చూడగానే కేసీఆర్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. కవితకు కేసీఆర్ షేక్‌హ్యాండ్ ఇవ్వగా ఆమె ఆయన చేతికి ప్రేమతో ముద్దు పెట్టారు. అంతకుముందు కవితకు ఎర్రవెల్లి గ్రామస్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు.
పది రోజులు ఫామ్‌హౌస్‌లోనే..
ఇదిలా ఉంటే.. కవిత పది రోజులపాటు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లోనే ఉంటారని తెలిసింది. ఐదున్నర నెలలు జైల్లో గడిపిన తీరు.. పడిన ఇబ్బందులు.. న్యాయస్థానంలో, ఈడీ, సీబీఐ కస్టడీలో అడిగిన ప్రశ్నలు.. వాటికి కవిత చెప్పిన సమాధానాలు, భవ్యిషల్ కార్యాచరణ తదితర అంశాలపై తండ్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. తనను జగమొండిగా మార్చారన్న కవిత.. తన పోరాటం అన్ బ్రేకబుల్ అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తండ్రి సలహాతో ఎలాంటి పోరాట వ్యూహం రచిస్తారన్న చర్చ జరుగుతోంది.
•ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
•భర్త, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం.
•దిష్టి తీసి స్వాగతం పలికిన సిబ్బంది
•కన్న బిడ్డను చూడగానే భావోద్వేగానికి గురైన తండ్రి కేసీఆర్
•అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూసి… pic.twitter.com/rAjmpWcu0s— BRS Party (@BRSparty) August 29, 2024
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Mlc kavitha emotional hugging kcr viral video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com