Kavitha Bail: ఢిల్లీ మద్యం పాలసీని మార్చి. తద్వారా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేయడంతోపాటు, ఇందుకు ప్రైవేటు వ్యాపారుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై ఆరోపణలు ఉన్నాయి. మద్యం పాలసీ మార్పులు తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీ పిన్‌గా వ్యవహరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈమేరకు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో స్పష్టం చేశాయి. దీంతో కవితను ఈడీ ఈ ఏడాది మార్చి 15న అరెస్టు చేసింది. కస్టడీకి తీసుకుని విచారణ చేసింది. తర్వాత ఏప్రిల్ 11న సీబీఐ కూడా అరెస్టు చేసింది. కస్టడీలోకి తీసుకుని విచారణ చేసింది. రెండు సంస్థలు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశాయి. అయినా బెయిల్ మాత్రం ఇవ్వడాన్ని నిరాకరించాయి. దీంతో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఎట్టకేలకు ఆగస్టు 27 బెయిల్ మంజూరైంది. సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణకు కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. నిబంధనల మేరకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కవిత బయటకు వచ్చారు.
ఇక్కడి నుంచే రచ్చ..
కవిత బెయిల్‌కు బెయిల్ మంజూరు అయిన వెంటనే రచ్చ మొదలైంది. కవిత బెయిల్ ముందే ఊహించామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రహస్య ఒప్పందంలో భాగంగానే బెయిల్ మంజూరైందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కవిత బెయిల్‌పై స్పందించారు. తెలంగాణ నుంచి ఓ ప్రముఖ న్యాయవాదికి రాజ్యసభ సీటు కేటాయించడంతోనే కవితకు బెయిల్ వచ్చిందని, ఇందులో కాంగ్రెస్–బీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయం ఉందని పేర్కొన్నారు. వీటిని బీఆర్‌ఎస్ నేతలు ఖండించారు. కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని తెలిపారు. ఈ క్రమంలో ఆగస్టు 28న మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి కూడా కవితకు బెయిల్ ఎలా వచ్చిందో అందరికీ తెలుసన్నారు. బీజేపీ, బాఆర్‌ఎస్ రహస్య ఒప్పందంలో భాగంగానే బెయిల్ మంజూరైందని ఆరోపించారు. దీనిపై ఆగస్టు 29న సుప్రీ కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి హోదాలు ఉండి ఇలా మాట్లాడడం ఏంటని మండిపడింది.
తెరపైకి చంద్రబాబు..
ఇక కవితకు బెయిల్ అంశంపై బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే ఏపీ సీఎం చంద్రబాబు పేరు తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబుతో మాట్లాడిన కేటీఆర్ తన సోదరి కవితకు బెయిల్ వచ్చేలా చేశారని ప్రచారం జరుగోతంది. బాబు కూడా పాత గొడవలను పక్కన పెట్టి కవిత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కేంద్రంతో మాట్లాడి కవితకు బెయిల్ మంజూరు చేయించారని ప్రచారం జరుగుతోంది.
తెర వెనుక కేసీఆర్, కేకే..
ఇదిలా ఉంటే. కవితకు బెయిల్ వెనుక కేసీఆర్, కే.కేశవరావు తెరవెనుక మంత్రాంగం సాగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌లో నంబర్ 2 పొజిషన్‌లో ఉన్న కేకేను కేసీఆర్ తన బిడ్డకు బెయిల్ ఇప్పుంచుకునేందుకు కాంగ్రెస్‌లోకి పంపారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయనతో రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయించారని. ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ న్యాయవాదికి ఆ పదవి దక్కేలా చేశారని ప్రచారం జరుగుతోంది. ఫలితంగా ఆ న్యాయవాది కవితకు బెయిల్ వచ్చేలా చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కవిత కేసు వాదించిన అభిషేక్ సింఘ్వీ కోసమే కేకేతో రాజీనామా చేయించారని మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే.అరుణ ఆరోపించారు. కేశవరావు రాజ్యసభ సీటును అభిషేక్ సింఘ్వీకి ఇవ్వడం వెనక చాలా మతలబు ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే అని, హైడ్రా వెనక హైడ్రామా నడుస్తోందని తెలిపారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: There are allegations that kcr and k keshavrao were behind the scenes behind kavitha bail
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com