AP Liquor Scam: ఏపీ రాజకీయాల్లో( AP politics) ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే విచారణకు ఆదేశించింది. గత పది నెలల కాలంగా విచారణ కొనసాగుతోంది. మరోవైపు తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు అయింది. ముఖ్యంగా అప్పటి వైసిపి పెద్దల చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కానున్నారు. ఇదే కేసులో ఎంపీ మిధున్ రెడ్డికి సైతం సీట్ నోటీసులు ఇచ్చింది. మరోవైపు ఈ స్కాం లో కీలక వ్యక్తిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని ఆయన తరుపు తండ్రికి నోటీసులు అందజేశారు.
Also Read: హై కమాండ్ సీరియస్ వార్నింగ్.. గంటా కింకర్తవ్యం!
* ఒకరోజు ముందుగానే..
తొలుత విచారణకు హాజరుకావాలని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ( Vijaya Sai Reddy )నోటీసులు ఇచ్చింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వగా.. ఒకరోజు ముందుగానే తాను వస్తానని విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు. ఈరోజు విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరుకానున్నారు. మద్యం స్థానంలో కీలక వ్యక్తిగా పరిగణిస్తున్న రాజ్ కసిరెడ్డికి మూడుసార్లు సిట్ నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన పెద్దగా స్పందించలేదు. దీంతో ఆయన తండ్రికి నోటీసులు ఇచ్చారు. 19న విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిధున్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 18న సిట్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే మిథున్ రెడ్డి హాజరవుతారా? లేదా? అన్నది చూడాలి.
* ముందస్తు అరెస్టు లేకుండా..
వాస్తవానికి మద్యం స్కాం( liquor scam ) కేసులో అరెస్టు ఉంటుందని భావించిన మిధున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ముందస్తు అరెస్టు లేకుండా చూసుకున్నారు. అయితే కోర్టు మాత్రం విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. దీంతో మిధున్ రెడ్డి హాజరు అనివార్యంగా మారింది. అయితే ఇప్పుడు సిట్ దర్యాప్తులో మిధున్ రెడ్డి నోరు తెరుస్తారా? ప్రత్యేక దర్యాప్తు బృందం ఏ విషయాలను ఆరా తీస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులను భయపెట్టి.. తనకు కొనుకూలంగా మార్చుకున్నారని.. ఐటీ సలహాదారుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డి ద్వారా వ్యవహారాలు నడిపారన్న ఆరోపణలు ఉన్నాయి. చేతికి మట్టి అంటకుండా కమీషన్ల రూపంలో భారీగా దోచుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు దీని పైనే షిఫ్ట్ దర్యాప్తు చేస్తోంది.
* సిట్ ఎదుటకు విజయసాయిరెడ్డి..
అయితే ఈరోజు విజయసాయిరెడ్డి సిట్( special investigation team) ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే మద్యం కేసులో రాజ్ కసిరెడ్డి పాత్రను స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. మద్యం కేసులో విచారణకు పిలిస్తే తనకు తెలిసిన సమాచారం ఇస్తానని గతంలోనే సాయి రెడ్డి స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు విజయసాయిరెడ్డి. బిజెపిలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో సాయి రెడ్డి సిట్ ముందుకు వస్తే ఎలాంటి వివరాలు వెల్లడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి అయితే పరిస్థితి చూస్తుంటే వైసీపీ ముఖ్యుల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read: జగన్ ని వ్యతిరేకిస్తావా? పోలీస్ అధికారికి బెదిరింపులు!