spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP BJP: బిజెపి ఫుల్ క్లారిటీ.. పొత్తు ఇక లేనట్టే

AP BJP: బిజెపి ఫుల్ క్లారిటీ.. పొత్తు ఇక లేనట్టే

AP BJP: ఏపీ విషయంలో బిజెపి అంతరంగం అంతుపట్టడం లేదు. ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకవైపు పొత్తుకు సానుకూల సంకేతాలు పంపుతూనే.. మరోవైపు 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజెపి ఉంది. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున స్క్రీనింగ్ చేసి హై కమాండ్ కు పంపడం విశేషం. దీంతో అసలు ఏపీలో పొత్తు ఉంటుందా? లేదా? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ.. ఏపీలో మాత్రం ఒక్క పార్లమెంట్ స్థానానికైనా అభ్యర్థిని ప్రకటించలేదు.

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) జరగనుండడంతో జాతీయస్థాయిలో అందరి దృష్టి రాష్ట్రంపై పడింది. ఈ తరుణంలో ఏపీ ఫై బిజెపి ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితి ఉంది. కనీసం కాంగ్రెస్ పార్టీ చూపెడుతున్న దూకుడు కూడా బిజెపిలో లేదు. అసలు పొత్తుల విషయంపై స్పందన లేదు. రాష్ట్ర నాయకత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన పై ప్రత్యేక సమావేశం నిర్వహించింది. బిజెపి జాతీయ నాయకుడు శివప్రకాష్ తో పాటు మరికొందరు ముఖ్యులతో అభ్యర్థుల స్క్రీనింగ్ నిర్వహించారు. ఒక్కో జిల్లాకు 45 నిమిషాల నుంచి గంట పాటు సాగింది ఈ సమావేశం. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ స్థానానికి ముగ్గురు, పార్లమెంట్ సీటుకు ఇద్దరి చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 525 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హై కమాండ్ కు నివేదిక పంపారు. అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. దీంతో పొత్తులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

మరోవైపు బిజెపి కోసం చంద్రబాబుతో పాటు పవన్ ఎదురుచూస్తున్నారు. అటు బిజెపి చర్యలను చూసి పొత్తు ఉంటుందా లేదా అన్న టెన్షన్ కొనసాగుతోంది. ఈనెల 6న బిజెపి కీలక సమావేశం జరగనుంది. ఆ సమయంలోనే పొత్తులపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బిజెపి అడుగులు చూస్తుంటే పొత్తు లేదని అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. కానీ టిడిపి నేతలు మాత్రం పొత్తు ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు పవన్ సైతం అదే లెక్కతో ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో పొత్తుపై స్పష్టత వస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. ఒకవేళ బిజెపి రాకుంటే ప్రత్యామ్నాయం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...
Oktelugu Epaper