Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- YCP: ఒక్క సీటు గెలవని వ్యక్తిపై ఇంత నిర్భంధమా.. వైసీపీకి ఎందుకంత భయం?

Pawan Kalyan- YCP: ఒక్క సీటు గెలవని వ్యక్తిపై ఇంత నిర్భంధమా.. వైసీపీకి ఎందుకంత భయం?

Pawan Kalyan- YCP: పవన్‌ అంటే.. ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి, ఒక ఇజం.. ఒక భరోసా.. ఒక ధీమా.. ఈ పేరు వింటే పేదలకు నమ్మం.. పాలకులకు వణుకు. తప్పుచేసిన వారి గుండెల్లో దడ. కొత్తగా రాజకీయల్లోకి వచ్చాడు. రాజకయ వారసత్వం లేదు. పదవులపై కాంక్ష అంతకన్నా లేదు. సమాజంలో మార్పు రావాలి.. అందరికీ ప్రభుత్వ సేవలు అందాలి, పేద ధనిక భేదం పోవాలి.. ఇవే ఆయన నినాదాలు. ఇవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పాలకులను గడగడలాడిస్తున్నాయి. చట్ట సభల్లో ఆయనకు ప్రాతినిధ్యం లేదు. అయినా ఆయన పిలుపునిస్తే.. ఆయన ప్రశ్నిస్తే ప్రభుత్వంలో వణుకు పుడుతోంది.. సమాధానం చెప్పలేక మంత్రులు తటపటాయిస్తున్నారు. ఆయన పర్యటి ఉంది అంటే.. పాలకుల వెన్నులో వణుగు పుడుతోంది.. గుండెల్లో రైళ్లు్ల పరిగెడుతున్నాయి. ఇందుకు తాజాగా విశాఖ ఘటనే ఉదాహరణ.

Pawan Kalyan- YCP
Pawan Kalyan- Jagan

అతనొక్కడే..
జనసేనాని పవన్‌ కళ్యాణŠ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు దాదాపు ఏడాదిగా జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 8న విశాఖపట్టణంలో మూడు రోజులు కార్యక్రమం నిర్వహించాలని మూడు నెలల ముందే నిర్ణయించారు. అయితే.. అదే రోజు అధికార వైపీపీ మద్దతులో ఉత్తరాంద్రలో కొంతమంది గర్జన సభ ఏరాపటు చేశారు. దీనిపై పవన్‌ కళ్యాణ్‌ కానీ, జనసేన నాయకులు కానీ ఎలాంటి విమర్శలు చేయలేదు. గర్జన ఎవరి కోసం అని మాత్రమే పవన్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. దీనికే ఏపీ పమంత్రులు విమర్శల దాడి మొదలు పెట్టారు. పార్టీతోపాటు వ్యక్తిగత ధూషణలు చేశారు. అయినా జనసేనాని శాంతంమే ప్రదర్శించారు. 8వ తేదీన అధికార పార్టీ మద్దతులో గర్జన సభ నిర్వహించుకున్నారు. అదే రోజు సాయంత్రం పవన్‌ వైజాగ్‌ బయల్దేరారు. జన సేనానికి స్వాగం పలికేందుకు జన సైనికులు విశాఖ ఎయిర్‌ పోర్టుకు భారీగా తరలి వచ్చారు. అదే సమయంలో గర్జన సభ ముగించుకుని వస్తున్న మంత్రులను చూసి తమ నాయకుడు ప్రశ్నించిన విధంగానే గర్జన ఎవరికోసం అని జన సైనికులు గర్జించారు. దీనికి సమాధానం చెప్పలేని మంత్రులు.. కొద్దిమంది జనసైనికులకే బెదిరిపోయారు.

తమ చేతిలో అధికారం ఉంది కదా అని ఒక్కడుగా విశాఖకు వచ్చిన జన సేనాని పవన్‌ను హోటల్‌లో నిర్బంధించారు. రెండు రోజులుగా ఆయనను కాలు బయట పెట్టనివ్వడం లేదు. విశాఖ విడిచి పోవాలని బెదిరింపులకు దిగింది ప్రభుత్వం. ‘నన్ను అరెస్టు చేస్తారంటూ ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు కూడా ఫోన్లు, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. పోలీసు కమిషనర్‌ కూడా ఆదివారం తెల్లవారుజామున హోటల్‌కు వచ్చి పరిశీలించారు. నన్నెందుకు అరెస్ట్‌ చేస్తారు? నేనేమైనా సంఘ విద్రోహ, దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నానా?’ అని పవన్‌ ప్రశ్నించారు. ‘గంజాయి సాగు చేసేవాళ్లను, వారికి వత్తాసు పలుకుతున్న రాజకీయ నాయకులను వదిలి సామాన్యుల వేదనను విందామని వచ్చిన నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేనున్న హోటల్‌ చుట్టూ 500 మందికి పైగా పోలీసులను మోహరించారు. సుమారు వంద మంది జనసేన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మీడియా సిబ్బంది కెమెరాలూ లాక్కున్నారు. ర్యాలీకి అనుమతి తీసుకున్న వారిపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు. ప్రతి విషయం గుర్తుంచుకుంటాం. ప్రతిదానికీ సమాధానం చెబుతాం’ అని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం పాలకుల నిర్బంధకాండకు నిదర్శనం.

ఒక్కసీటు గెలవలేదన్నవారే వణికిపోతున్నారు..
పవన్‌ సారథ్యంలో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచిందని, ఆ ఎమ్మెల్యే కూడా పవన్‌తో ఇప్పుడు లేడని వైసీపీ నాయకులు తరచూ విమర్శిస్తుంటారు. పవన్‌ తాను పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయాడని, ఆయన రీల్‌ స్టార్‌ మాత్రమే అని.. రియల్‌ స్టార్‌ కాదంటూ ఎదురు దాడి చేస్తారు. కానీ పవన్‌ మాట్లాడితే వైసీపీ ప్రభుత్వంలో వణుకు పుడుతోంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నిర్బంధం కొనసాగిస్తోంది. ఒక్క సీటు గెలవలేని పవన్‌కు ప్రభుత్వం ఎందుకు వణుకుతుందో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. అర్థం కావాల్సింది పాలకులకే.

Pawan Kalyan- YCP
Pawan Kalyan

ప్రజాదరణ పెరుగుతుందనే..
2019 ఎన్నికల సమయంలో ఉన్న పవన్‌ వేరు.. ప్రస్తుత పవన్‌ వేరు. సర్వే జనా సుఖినో భవంతు అన్న సంకల్పంతో పదవులపై ఎలాంటి కాంక్ష లేకుండా పవన్‌ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. దీనిని గుర్తించిన ప్రజలు పవన్‌పై నమ్మకం పెంచుకుంటున్నారు. ప్రశ్నించే నాయకుడు రావాలని కోరుకుంటున్నారు. దీనిని గుర్తించిన జగన్‌ సర్కార్‌.. పవన్‌ను కట్టడి చేయకుంటే తమ పీఠాలు గదిలిపోతాయని గుర్తించింది. పవన్‌ ఏ కార్యక్రమం చేపట్టినా.. మంత్రులను ఎగదోస్తున్నాడు జగన్‌. పవన్‌ సంధించే ఒక్క ప్రశ్నకు నలుగురైదుగురు మంత్రులు మీడియా ముందుకు వచ్చి సమాధానం, ఇవిరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం పాలకుల్లో పవన్‌పై ఉన్న భయానికి నిదర్శనం. ఒక్కడిని చేసి విశాఖలో కొనసాగిస్తున్న నిర్బంధకాండపై కూడా పవన్‌ ఒక్కడే పోరాడుతున్నారు. పోలీసు బలగాలను మోహరించినా అదరలేదు. బెదరలేదు. జనమే తన బలంగా.. పోలీసులు అరెస్టు చేసిన జన సైనికులను కాపాడుకోవడమే లక్ష్యంగా మూడు రోజుల పర్యటనను పూర్తి చేసుకోవాలనే సంకల్పంతో విశాఖలోనే ఉన్నారు. అట్లుంటది పవన్‌ అంటే.. అదీ పవనిజమంటే. పాలకులు ఇప్పటికైనా మారకపోతే.. మున్ముందు వైసీపీ సర్కార్‌పై ప్రజల తిరుగుబాటు తప్పదు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular