Homeజాతీయ వార్తలుIndia Surgical Strike In Myanmar: మయన్మార్‌లో భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్‌.. ఆ ఆపరేషన్ ఏ...

India Surgical Strike In Myanmar: మయన్మార్‌లో భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్‌.. ఆ ఆపరేషన్ ఏ రేంజ్ లో సాగిందంటే..

India Surgical Strike In Myanmar: భారతదేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి గ్రూపుల మధ్య ఘర్షణలు సృష్టించడం, ప్రజలపై దాడులు చేయడం, ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి రేకెత్తించడం ఉగ్రవాద ముఠాల ప్రధాన వ్యూహం. నాగా, అసోం, మణిపూర్‌ లాంటి రాష్ట్రాల్లో వేర్పాటువాద గ్రూపులు సరిహద్దు దాటి మయన్మార్‌లో తలదాచుకుని, భారత్‌లో విధ్వంసక చర్యలు సృష్టిస్తున్నాయి. అమెరికా కూడా వీటిని ప్రోత్సహిస్తోంది. ఇటీవల అమెరికా ఏజెంటు, ఉక్రెయిన్‌కు చెందిన ఆరుగురు పట్టుపడ్డారు. ఈ నేపథ్యంలో ఈశాన్య భారతంలో శాంతి నెలకొల్పడం, […]

India Surgical Strike In Myanmar: భారతదేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి గ్రూపుల మధ్య ఘర్షణలు సృష్టించడం, ప్రజలపై దాడులు చేయడం, ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి రేకెత్తించడం ఉగ్రవాద ముఠాల ప్రధాన వ్యూహం. నాగా, అసోం, మణిపూర్‌ లాంటి రాష్ట్రాల్లో వేర్పాటువాద గ్రూపులు సరిహద్దు దాటి మయన్మార్‌లో తలదాచుకుని, భారత్‌లో విధ్వంసక చర్యలు సృష్టిస్తున్నాయి. అమెరికా కూడా వీటిని ప్రోత్సహిస్తోంది. ఇటీవల అమెరికా ఏజెంటు, ఉక్రెయిన్‌కు చెందిన ఆరుగురు పట్టుపడ్డారు. ఈ నేపథ్యంలో ఈశాన్య భారతంలో శాంతి నెలకొల్పడం, ఉవ్రాదులను ఏరివేయడంపై భారత్‌ దృష్టిపెట్టింది. ఉగ్ర కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి భారత సైన్యం కఠిన చర్యలకు దిగింది.

ఉగ్ర క్యాంపు ధ్వంసం..
ఏప్రిల్‌ 6న మయన్మార్‌లోని నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌–ఖాప్లాంగ్‌ (ఎన్‌ఎస్‌సీఎన్‌–కె) క్యాంపుపై ఏప్రిల్‌ 6న భారత డ్రోన్లు, క్షిపణులతో సర్జికల్‌ స్ట్రైక్‌ నిర్వహించాయి. ఈ దాడిలో 25 మంది ఉగ్రవాదులు మృతిచెందారు, అనేక మంది గాయపడ్డారు. ఇది భారత్‌ మయన్మార్‌లో నిర్వహించిన మూడో సర్జికల్‌ దాడి. ఎన్‌ఎస్‌సీఎన్‌–కె ఈ దాడిని అంగీకరించింది. మయన్మార్‌లోని హోయత్‌ బస్తీలోని ఉగ్రవాద శిబిరం పూర్తిగా ధ్వంసమైంది.

ఉన్మాద కార్యకలాపాలకు చెక్‌..
ఈశాన్య రాష్ట్రాల్లో విధ్వంసక చర్యలు సృష్టిస్తూ, మయన్మార్‌లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులను భారత సైన్యం టార్గెట్‌ చేస్తోంది. అసోం రైఫిల్స్‌ చెక్‌పోస్టులపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఈ ఆపరేషన్‌ ప్లాన్‌ చేయబడింది. సరిహద్దు దాటి దాడులు చేసి, భారత్‌లో అశాంతి రేకెత్తించే ముఠాలకు ఇది గట్టి హెచ్చరిక. ఎన్‌ఎస్‌ఈఎన్‌–కె, ఎల్ఫా–ఐ, ఎన్‌డీఎఫ్‌బీ లాంటి గ్రూపులు మయన్మార్‌లో శిబిరాలు నడుపుతున్నాయి.

మూడు సర్జికల్‌ స్ట్రైక్స్‌..
2015 జూన్‌ 9న మొదటిసారి ఆపరేషన్‌ హాట్‌ పర్సూ్యట్‌’ పేరుతో ఎన్‌ఎస్‌సీఎన్‌–కె క్యాంపులపై దాడి జరిగింది. 40 నిమిషాల ఈ ఆపరేషన్‌లో 38 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. 2019లో రెండోసారి, 2025 జూలైలో మూడోసారి దాడులు జరిగాయి. 2025 దీపావళి నాడు జరిగిన ఆపరేషన్‌లో మూడు గ్రూపుల కమాండర్లు హతమయ్యారు. ఇప్పుడు ఏప్రిల్‌ 6న జరిగిన దాడితో మూడేళ్లలో మూడోసారి భారత్‌ మయన్మార్‌ అడవుల్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసినట్లయింది.

డ్రోన్లు, క్షిపణులు, స్పెషల్‌ ఫోర్సెస్‌..
భారత వాయుసేన ఎంఐ – 17 హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణుల సహాయంతో పారా కమాండోలు రెండు క్యాంపులపై దాడి చేశాయి. రెండు గంటలకుపైగా సాగిన ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సుమారు 150 మంది ఉగ్రవాదులు ఉన్న క్యాంపుల్లో 50–100 మంది మృతిచెందినట్లు అంచనా. నిఘా వర్గాలు సమకూర్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు కచ్చితత్వంతో సైన్యం నిర్వహించింది.

ఈ సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఉగ్రవాద ముఠాలకు గట్టి షాక్‌ ఇచ్చాయి. మయన్మార్‌లో తలదాచుకున్న ఉగ్రవాదులు ఇక సురక్షితం కాదనే సందేశం వెళ్లింది. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొనే అవకాశాలు పెరిగాయి. భారత సైన్యం సమర్థవంతమైన చర్యలు కొనసాగిస్తూ, జాతీయ భద్రతను కాపాడుతోంది. ఉగ్రవాద గ్రూపుల ఆర్థిక మూలాలు, నిర్మాణాలు దెబ్బతిన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు కొనసాగే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper