Homeజాతీయ వార్తలుHighest Tamarind Producing States In India: భారతదేశంలో అత్యధికంగా చింతపండు పండించే రాష్ట్రాలు ఇవే..

Highest Tamarind Producing States In India: భారతదేశంలో అత్యధికంగా చింతపండు పండించే రాష్ట్రాలు ఇవే..

Highest Tamarind Producing States In India: ఆహారం తీసుకునే సమయంలో ఆరు రుచులు తప్పనిసరిగా ఉండాలని కొందరు అంటూ ఉంటారు. ఈ ఆరు రుచుల్లో పులుపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పులుపు అనేది చింత చెట్టు ద్వారా వచ్చే చింతపండు నుంచి లభ్యమవుతుంది. చింతపండుతో చేసే ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా చింతపండులో పోషక విలువలు కూడా ఉంటాయి. ఇందులో టార్టారిక్ యాసిడ్, విటమిన్ సి, బి సమృద్ధిగా ఉంటాయి. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అత్యధికంగా చింతపండు లభ్యమవుతుంది. మరి భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా చింతపండు లభ్యమవుతుంది? చింతపండు వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి?

Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!

చింతపండు అనేది సాధారణంగా ఉష్ణ మండలంలో ఎక్కువగా పండుతుంది. ఇందులో ఉండే పులుపు రుచి కొన్ని పదార్థాలకు అనుకూలంగా ఉంటుంది. మన దేశంలో దక్షిణ, మధ్య భారత దేశంలో ఇది ఎక్కువగా పండించబడుతుంది. వీటిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో చింతపండు చెట్లను చూడవచ్చు. భారతదేశంలో పండించే చింతపండు దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా సరఫరా చేస్తారు. ముఖ్యంగా ఆసియా ఖండంలోని చాలా దేశాలు చింతపండు ద్వారా అనేక పదార్థాలు తయారు చేస్తారు. చింతపండు గుజ్జును వంట, పానీయాలు, సాస్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే ఔషధాలు, సాంప్రదాయ ఉత్పత్తులు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తుంటారు.

భారతదేశంలో ప్రాంతీయ మార్కెట్లో చింతపండుకు ప్రధాన వాటా కలిగి ఉంది. దీని ద్వారా చిన్న రైతులు, వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి కూడా ఇది ఎంతో సహాయం చేస్తుంది. చింత చెట్లు ఎక్కువగా ఇసుక, ఒండ్రు నేలల్లో పండుతుంది. అంతేకాకుండా భారతదేశంలో అతిపెద్ద ఎగుమతి చేసే పండు చింతపండు అని తెలుస్తోంది. అయితే ఇక్కడ అత్యధికంగా చింతపండు పండడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో భారతదేశంలో సమశీతోష్ణస్థితి ఉండడం.. అలాగే ఇక్కడి నేలలు పొడిబారి గా ఉండడం.. చింతపండు చెట్లు దీర్ఘకాలంగా ఉండడానికి అవసరమైన వాతావరణాన్ని కలిగి ఉండటం.. వంటివి ఇక్కడ చింతపండు పండడానికి అనుకూలంగా ఉంటుంది.

భారతదేశంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో చింతపండు చెట్లు కనిపిస్తాయి. కానీ కొందరు జీవనోపాధి కోసం ప్రత్యేకంగా చెట్లను ఏర్పాటు చేశారు. ఈ చెట్ల ద్వారా అనేక రకాలుగా ఉపాధి పొందవచ్చు. కొందరు చింతపండును నేరుగా విక్రయిస్తారు. మరికొందరు వ్యాపారులకు విక్రయించి లాభాలు పొందుతారు. చింత చెట్టును పెంచడానికి ప్రత్యేకంగా సదుపాయాలు చేర్చాల్సిన అవసరం లేదు. వాతావరణాన్ని బట్టి చింత చెట్లు ఏపుగా పెరుగుతూ ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular