Homeఎంటర్టైన్మెంట్Sree Vishnu Mrityunjay Trailer Review: శ్రీవిష్ణు 'మృత్యుంజయ్ ' ట్రైలర్ వచ్చేసింది..ఇదేమి థ్రిల్లర్ బాబోయ్..సినిమాలో...

Sree Vishnu Mrityunjay Trailer Review: శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్ ‘ ట్రైలర్ వచ్చేసింది..ఇదేమి థ్రిల్లర్ బాబోయ్..సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో!

Sree Vishnu Mrityunjay Trailer Review: శ్రీ విష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam) నిన్న భారీ అంచనాల నడుమ విడుదులై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ డీసెంట్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే ఆయన హీరో గా నటించిన మరో చిత్రం ‘మృత్యుంజయ్'(Mrityunjay Movie) కూడా నిన్ననే విడుదల కావాల్సి ఉంది. కానీ ఒకే రోజు , ఒకే హీరో కి సంబంధించిన రెండు సినిమాలు విడుదలైతే కచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని , ఈ చిత్రాన్ని మార్చి 6 కి వాయిదా వేశారు . కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు . ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత శ్రీ విష్ణు చేస్తున్న సీరియస్ మూవీ ఇది.

Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!

ఇన్ని రోజులు ఎక్కువగా ఆయన ఎంటర్టైన్మెంట్ జానర్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ ట్రైలర్ ని చూస్తుంటే ఒక మంచి ఇంటెన్సిటీ తో కూడా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా అనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో ఒక సైకో కిల్లర్ ఉంటాడు. ఎదో ఒక కారణం చేత జనాలను చంపుతూ ఉంటాడు. అతన్ని కనిపెట్టి ఎలా పట్టుకున్నారు అనేదే స్టోరీ గా ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. ఒక సైకో కిల్లర్ వల్ల అతని కుటుంబం చాలా ఇబ్బందులకు గురి అవుతుంది. చివరికి పోలీసుల సహాయంతో అతన్ని ఎలా పట్టుకున్నాడు అనేదే స్టోరీ . అదే విధంగా ఈ ట్రైలర్ లో చూపించిన చిన్న పాప ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు. ఆ చిన్నారి కచ్చితంగా శ్రీవిష్ణు అన్న / లేదా తమ్ముడు కూతురు అయ్యుంటుందని అనుకుంటున్నారు.

ఈ చిత్రం లో రెబ్బ మోనికా జాన్ హీరోయిన్ గా నటించింది. ఇందులో ఆమె పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘సామజవరగమనా ‘ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . మళ్లీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అనగానే కాస్త అంచనాలు పెరిగాయి. చూడాలి మరి ఈ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా లేదా అనేది. అయితే వరుసగా కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీవిష్ణు ని , ఇలా ఒక్క సారిగా సీరియస్ లో ఆడియన్స్ చూడగలరా లేదా అనేది చూడాలి . సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న ఈ థియేట్రికల్ ట్రైలర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular