అతడో కామాంధుడు. అప్పటికే పెళ్లయినా ఇంకో మహిళను వివాహం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా మరో ఆవిడతో అక్రమ సంబంధం నడుపుతున్నాడు. రోజూ మద్యం సేవించడం ఎంజాయి చేస్తూ మహిళలపై కామంతో కోరిక తీర్చుకోవడం అతడి అలవాటు. కానీ అదే అతడి ప్రాణం మీదకు వచ్చింది. కూతురు వయసున్న బాలిక మీద కన్నేసి చివరకు ప్రాణాలు కోల్పోయాడు.

ఇంట్లో ఎవరు లేరని తెలుసుకుని బాలికను లైంగికంగా వేధించి తన కోరిక తీర్చుకున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు అతడిని కొట్టి చంపారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తమిళనాడులోని తేన్ కాశి జిల్లాలోని కడయనల్లూరులోని దేవాలయం వీధిలో గోపాల్ (55) అనే వ్యక్తి ఉంటున్నాడు. గోపాల్ కు వివాహం అయి భార్య ఉంది. ఆమె ఉండగానే మరో మహిళను కూడా పెళ్లి చేసుకున్నాడు.
ఇద్దరు భార్యలతో కాపురం చేసి నలుగురు బిడ్డల తండ్రి అయ్యాడు. కానీ అంతటితో అతడి కామం తీరలేదు. ఎదురైన మహిళనల్లా అదే తీరుగా చూస్తూ తనలోని కామాన్ని వెల్లడించేవాడు. దీంతో అతడికి అక్రమ సంబంధాలు కూడా ఎక్కువేనని తెలుస్తోంది. దీంతో అతడి ప్రవర్తనలో మార్పు మాత్రం కనిపించలేదు. పెయింటింగ్ పని చేసే గోపాల్ ఎప్పుడూ అదే ధ్యాస. కొత్తదనం కోసం పరుగులు పెట్టేవాడు.
Also Read: Narendra Modi: బీజేపీ బ్యాక్ స్టెప్ వేయడం ఇది ఎన్నో సారి ?
కామ వాంఛతో రగిలిపోయేవాడు. దీంతో ఓ సారి పెయింటింగ్ పని చేస్తుండగా సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లిన గోపాల్ ఇంట్లో బాలిక ఒక్కతే ఉందని గ్రహించి మంచినీళ్లు కావాలని వెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. దీంతో బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు గోపాల్ ను చితకబాది బండ రాళ్లతో కొట్టి చంపారు. గోపాల్ హత్య కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసినట్లు పపోలీసులు తెలిపారు.
Also Read: నేతల తిట్లు.. అసభ్యతకే మెట్లు.. రాష్ర్టంలో శృతిమించుతున్న రాజకీయాలు