Lakshmi Parvathi: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ చేసిన ఆరోపణలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. నందమూరి కుటుంబం యావత్తు వైసీపీ తీరుపై తప్పు పడుతుంటే లక్ష్మీపార్వతి మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఆనాడు ఎన్టీఆర్ పై చెప్పుల దండ వేయించినప్పుడు మీ బంధుప్రీతి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఎవరో ఒకరి మాయలో పడి నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారని చెబుతున్నారు. భువనేశ్వరి అంటే నాకు కూడా గౌరవం ఉందని, ఆమెపై నిజంగా ఆరోపణలు వస్తే నేను కూడా ఖండిస్తానని పేర్కొనడం గమనార్హం.

ఎన్టీఆర్ కుటుంబం అంతా బాలయ్య మాటలు వింటూ తప్పు దారిలో నడుస్తున్నారని ఆరోపించారు. తెలుగు జాతి అంటేనే ఎన్టీఆర్ కాదా అని ప్రశ్నించారు. మామను మోసం చేసి గద్దెనెక్కిన బాబుకు ప్రస్తుతం కష్టాలు వెన్నంటాయని తెలుస్తోందన్నారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు బాబు నాకు ఫోన్ చేసి దేశం విడిచి వెళ్తే డబ్బు ఇస్తానని చెప్పారని గుర్తు చేశారు. కావాలంటే ఆయనను అడగాలని సూచించడం తెలిసిందే.
ఎన్టీఆర్ మరణానికి కారకులు చంద్రబాబే అని విమర్శించారు. తండ్రికి అండగా నిలవాల్సిన బాలకృష్ణ పట్టించుకోలేదు. దీంతో ఆయన కలత చెంది మనోవేదనతోనే ప్రాణాలు విడిచారు. చంద్రబాబు లక్షల కోట్లు వెనకేసుకుని మమ్మల్ని వీధిన పడేశారు. దీంతో ఆ పాపమే ఇప్పుడు బాబుకు చుట్టుకుందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నా కుప్పంలో మాత్రం ఓటమి తప్పలేదు. ఫలితంగా ఆయనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.
Also Read: నేతల తిట్లు.. అసభ్యతకే మెట్లు.. రాష్ర్టంలో శృతిమించుతున్న రాజకీయాలు
కుటుంబ కలహాలతోనే రాజకీయం చేస్తున్నారని చూస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యలో భువనేశ్వరిని లాగడం బాధాకరమే. వ్యక్తిగత విషయాలపై నాయకులు తొందరపడి మాట్లాడుతూ చిక్కుల్లో పడుతున్నారని ఎద్దేవా చేశారు. నైతికతకు పెద్దపీట వేస్తూ హుందా రాజకీయాల కోసం పనిచేయాల్సిన అవసరం నేతలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని తెలుస్తోంది.
Also Read: Narendra Modi: బీజేపీ బ్యాక్ స్టెప్ వేయడం ఇది ఎన్నో సారి ?