Homeజాతీయ వార్తలుFuel Price Hike In India: ఈసారి మోత మోగిపోద్దీ.. ధరలు భారీగా పెరుగుతాయట.. ముందే...

Fuel Price Hike In India: ఈసారి మోత మోగిపోద్దీ.. ధరలు భారీగా పెరుగుతాయట.. ముందే సర్దుకోండి..

Fuel Price Hike In India: పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో ప్రపంచంపై తీవ్రంగా ఉంది. ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. హర్మూజ్‌ మూసివేతతో చమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో యురోపియన్‌ యూనియన్‌ దేశాలతోపాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, జపాన్‌ తీవ్రంగా ప్రభావం ఎదుర్కొంటున్నారు. రెండు నెలలు భారత్‌ సర్దుబాటుతో నెట్టుకొచ్చింది. తాజాగా ప్రజలపై భారం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సామాన్యుల జేబును ఖాళీ చేయబోతోంది. వంట గ్యాస్‌ నుంచి పాల వరకు అన్ని ధరలు పెరుగుతున్నాయి. […]

Fuel Price Hike In India: పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో ప్రపంచంపై తీవ్రంగా ఉంది. ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. హర్మూజ్‌ మూసివేతతో చమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో యురోపియన్‌ యూనియన్‌ దేశాలతోపాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, జపాన్‌ తీవ్రంగా ప్రభావం ఎదుర్కొంటున్నారు. రెండు నెలలు భారత్‌ సర్దుబాటుతో నెట్టుకొచ్చింది. తాజాగా ప్రజలపై భారం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సామాన్యుల జేబును ఖాళీ చేయబోతోంది. వంట గ్యాస్‌ నుంచి పాల వరకు అన్ని ధరలు పెరుగుతున్నాయి.

ఇప్పటికే పెరిగిన ధరలు..
ఇప్పటికే కుకింగ్ ఆయిల్ లీటర్‌కు రూ.150 నుంచి రూ.177-190కి వరకు అంటే సుమారు 20 శాతం పెరిగాయి. అమూల్‌, మదర్‌ డెయిరీ పాల ధరను లీటర్‌కు రూ.2 పెంచాయి, గతేడాది 12 శాతం పెరిగింది. ఇక ఎల్‌పీజీ 14.2 కేజీల సిలిండర్‌ ధర రూ.50 నుంచి రూ.100 పెరిగే అవకాశం ఉంది. సబ్బులు, షాంపూలు ధరలు కూడా 15 నుంచి 20 శాతం పెరుగుతాయని సమాచారం. కూరగాయల ధరలు 18 శాతం, పండ్ల ధరలు 22 శాతం పెరిగే అవకాశం ఉంది.

పెరుగుదలకు కారణాలు..
అమెరికా ఇరాన్‌ యుద్ధం కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు బ్యారెల్‌కు వంద డాలర్ల వరకు చేరింది. యుద్ధానికి ముందు 80 నుంచి 85 డాలర్లు ఉండేది. ఇక దేశీయంగా పశు ఆహారం 30 శాతం పెరిగింది. ఇది పాల ధరలను ప్రభావితం చేసింది. సప్లై చైన్ దెబ్బతినడం, జీఎస్టీ పెంపు ధరలపై ప్రభావం పడింది.

ఆర్థిక పరిణామాలు…
ధరల పెరుగుదలతో ఒక కుటుంబం నెల ఖర్చు రూ.18 వేలకు పెరుగుతుందని అంచనా. ఇప్పటికే మధ్యతరగతి ఆదాయం 12% తగ్గింది. దీంతో జీడీపీ పడిపోయే అవకాశం ఉంది. పేదలకు ధరలు భారంగా మారనున్నాయి. దీంతో ఆర్‌బీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ప్రభుత్వం ఆయిల్ రిజర్వ్ విడుదల, ఎగుమతి డ్యూటీ తగ్గింపు చేసింది. వ్యవసాయ సాంకేతికత, రెన్యూబల్ ఇంధనాలు, యాంటీ-హోర్డింగ్ చట్టాలు కీలకం. ప్రజలు లోకల్ మార్కెట్లు, బల్క్ బైయింగ్ ఎంచుకోవాలి. ధరల పెరుగుదలను అరికట్టకపోతే ఆర్థిక అస్థిరత పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper