Homeజాతీయ వార్తలుNEET Protest Controversy: బొద్దింకల అసలు కుట్ర ఇలా బయటపడింది..

NEET Protest Controversy: బొద్దింకల అసలు కుట్ర ఇలా బయటపడింది..

NEET Protest Controversy: పేరుకేమో నీట్ ఉద్యమం. ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా మేధావులను పిలిపిస్తున్నారు. విద్యార్థులను పోగు చేస్తున్నారు. ఆ తర్వాత నినాదాలు మొదలు పెడుతున్నారు. కొన్ని సందర్భాలలో ఆందోళన కట్టు తప్పిపోతున్నది. చేస్తున్న నిరసన హద్దు దాటిపోతున్నది. నినాదం వేరే వైపు వెళ్లిపోతున్నది. నీట్ అనే విషయాన్ని పక్కనపెట్టి.. కాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 ఎందుకు రద్దు చేశారు.. పెద్ద నోట్లు ఎందుకు రద్దు చేశారు.. ఇలా రకరకాల డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. కొంతమంది […]

NEET Protest Controversy: పేరుకేమో నీట్ ఉద్యమం. ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా మేధావులను పిలిపిస్తున్నారు. విద్యార్థులను పోగు చేస్తున్నారు. ఆ తర్వాత నినాదాలు మొదలు పెడుతున్నారు. కొన్ని సందర్భాలలో ఆందోళన కట్టు తప్పిపోతున్నది. చేస్తున్న నిరసన హద్దు దాటిపోతున్నది. నినాదం వేరే వైపు వెళ్లిపోతున్నది. నీట్ అనే విషయాన్ని పక్కనపెట్టి.. కాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 ఎందుకు రద్దు చేశారు.. పెద్ద నోట్లు ఎందుకు రద్దు చేశారు.. ఇలా రకరకాల డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

కొంతమంది కుహనా మేధావులు ఈ ఆందోళనను గొప్పగా చెబుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులకు సంఘీభావంగా నిలుస్తున్నారు. ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు అయితే బొద్దింకలు వచ్చే ఎన్నికల్లో విఫలవానికి నాంది పలుకుతాయని అంటున్నారు. వాస్తవానికి దేశ రాజకీయాలను మార్చే శక్తి యువతకు ఉంది. కానీ మనదేశంలో యువత విధ్వంసం సృష్టించే విధంగా పొలిటికల్ స్పేస్ లేదు. కేంద్రంలో ఒకప్పటి మాదిరిగా అక్రమాలు జరగడం లేదు. అన్యాయాలు జరగడం లేదు. నరేంద్ర మోడీ చాలా విషయాలలో కఠినంగానే ఉంటున్నారు. కానీ, కొంతకాలంగా అధికారానికి దూరంగా ఉంటున్న పార్టీలో కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్నాయి. ఆ ఉద్యమాలకు పెద్దగా ఆదరణ లభించకపోవడంతో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.

ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. ఏం చేస్తున్నావ్ ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ అక్కడే ఉన్నారు. ఉదయం నిరసనలో పాల్గొనడం.. రాత్రి ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసేవారు. అంతేకాదు విలాసవంతమైన సౌకర్యాలను ఆస్వాదించేవారు. ఆయనకు ఇవన్నీ కల్పించింది జునైద్. ఇతడు మరెవరో కాదు.. కొంతకాలంగా ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తి. పైగా ఇతడు బంగ్లాదేశ్ దేశస్థులకు బెంగాల్ రాష్ట్రంలో ఓటు హక్కును తొలగించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ ప్రజలను బెంగాల్ నుంచి బయటికి వెళ్లగొట్టడాన్ని తీవ్రంగా నిరసించాడు. అటువంటి జునైద్ అభిజిత్ కు సహాయం చేయడం.. ఆందోళనలో పాల్గొన్న వారికి ఆహార పొట్లాలు.. నీళ్ల ప్యాకెట్లు.. డబ్బులు మొత్తం ఇతడే సమకూర్చాడు.

జునైద్ వ్యవహార శైలి పట్ల ఎప్పటినుంచో అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు అతని మీద ప్రముఖంగా దృష్టి సారించాయి. అతడి లావాదేవీలు.. ఇతర వ్యవహారాల మీద ఒక కన్నేసి ఉంచాయి. ఈ ప్రకారం చూసుకుంటే అతడి అసలు బాగోతాన్ని అతి త్వరలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు బయట పెట్టబోతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ అసలు రంగును సభ్య సమాజం ముందు ఉంచబోతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper