spot_img
Homeఆంధ్రప్రదేశ్‌డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో దోపిడీ

డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో దోపిడీ

Duble bedroom housesప్రజల్లో ఉండే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తుంటారు. మోసపోయే వాడు ఉన్నంత కాలం మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు. ప్రజల ఆశలను ఆయుధాలుగా చేసుకుని మోసాలకు పాల్పడే వారి గురించి ఎన్నో వింటున్నాం. మళ్లీ మోసపోతున్నాం. ఎవడో ఏదో చెబితే నమ్మేయడం చివరికి మోసపోయామని బాధపడడం అలవాటైంది. మోసాన్ని మొదటే గుర్తించి నిలదీస్తే ఈ బాధలు ఉండవు. అందినకాడికి దోచుకుని చేతులెత్తేయం కొత్తేమీ కాదు. ఇదివరకు జరిగిన సంఘటనలే. అయినా కొత్త తరహాలో మోసపోవడం. ఇంకెన్నాళ్లు ఈ అమాయకత్వం. ఎన్నేళ్లు మోసాలకు గురికావడం. వీటికి అడ్డుకట్ట లేదా?

హైదరాబాద్ వేదికగా ఓ ముఠా దోపిడీకి పాల్పడింది. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లనే ఆయుధంగా చేసుకుని బురిడీ కొట్టించింది. ఈ పథకంలో ఇళ్లు ఇప్పిస్తామని ఆర్సీ పురంలో ఓ ముఠా రూ. కోట్లు వసూలు చేసింది. సెక్రటేరియట్ లో పరిచయాలున్నాయి. తాము ఎంత చెబితే అంతే అని నమ్మించి అమాయకుల నుంచి రూ. లక్షలు వసూలు చేసింది. దీంతో అమాయకులు ఇళ్లు వస్తాయనే ఆశతో ఉన్నదంతా దోచిపెట్టారు.

ఈ ముఠా హంగూ, ఆర్భాటాలు చూసి రూ. లక్షల్లో ముట్టజెప్పారు. అలా వచ్చిన డబ్బుతో వారు ఏకంగా 50 కార్లు కొనుగోలు చేశారు. అంటే వారు ఏ రేంజ్ లో వసూలు చేశారో అర్థం అవుతోంది. ఇళ్లు ఇప్పిస్తామంటూ రోజులు,నెలలు వాయిదా వేస్తుండడంతో డబ్బులు కట్టిన ఓ బాధితుడికి అనుమానం వచ్చి ఆరా తీయగా విషయం తెలిసింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి 50 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ పథకాల విషయంలో మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరో ఏదో చెబితే నమ్మి తరువాత మోసపోయామని గుర్తిస్తే ఏం లాభం. ముందే జాగ్రత్తగా వ్యవహరించి ఎవరైనా నిలదీయాలి. అసలు విషయం తెలుసుకోవాలి. వారి అర్హతలేంటని ఆరా తీయాలి. లేకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. అర్హులైన వారు నేరుగా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మంజూరు చేస్తే మీకు ఆధారం ఉంటుంది. ఇలా నకిలీ మఠాలను నమ్మి మోసపోయి డబ్బు వృథా చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper