Crime News: ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాక ఆ బాధను తెలుసుకొని తోటి వారి సపోర్టుతో మరోసారి ఆత్మహత్యాయత్నంచేయడానికి ఎవరైనా వెనుకాడుతారు. తల్లిదండ్రులు, బంధువుల సపోర్టుతో మళ్లీ నిలబడుతారు. కానీ మిస్ తెలంగాణగా ఎదిగిన మోడల్ ఒకసారి చావు అంచుల వరకూ వెళ్లి తప్పించుకుంది. ఇప్పుడు మరోసారి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది.

ఇటీవలే హైదరాబాద్ లో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు ప్రయత్నించి మిస్ తెలంగాణ టైటిల్ గెలిచిన మోడల్. తాజాగా ఆమె సొంతూరు కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో కీసర బ్రిడ్జి నుంచి మున్నేరు వాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్తానికులు ఆమెను చూసి వెంటనే రక్షించబట్టి సరిపోయింది. లేదంటే ఈసారి ప్రాణాలుపోయేవి. ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి చెందిన కలక భవాని అలియాస్ హాసిని (21) హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఒంటరిగా జీవిస్తోంది. ఓ ప్రైవేటు సంస్థ 2018లో నిర్వహించిన పోటీలో ‘మిస్ తెలంగాణ’గా ఎంపికైంది. హిమాయత్ నగర్ లో అపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉంటూ మోడలింగ్ చేస్తోంది.
ఈ క్రమంలోనే ఒంటరితనం ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఇటీవల తల్లిదండ్రులు, స్నేహితులకు ఫోన్ లు చేసి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వారు అలెర్ట్ అయ్యి 100కు కాల్ చేసి సమాచారం అందించగా పోలీసులు వెంటనే వచ్చి కాపాడారు.
అనంతరం హైదరాబాద్ నుంచి ఆమె తల్లిదండ్రులు సొంతూరు కృష్ణ జిల్లా తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ వాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
కాగా ఈ మిస్ ఇండియా ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలిపినట్లు పోలీసులు చెబుతున్నారు.