Homeఆంధ్రప్రదేశ్‌Surya Swaroop Success Story: ఒక చిన్న ఆలోచనతో లక్షలు అర్జిస్తున్న ఆ కుర్రాడు!

Surya Swaroop Success Story: ఒక చిన్న ఆలోచనతో లక్షలు అర్జిస్తున్న ఆ కుర్రాడు!

Surya Swaroop Success Story: చేతిలో ప్రతిభ, నైపుణ్యం ఉండాలి కానీ ఏ రంగంలోనైనా రాణించవచ్చు. అలానే నిరూపించుకున్నాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. ఒక చిన్న ఐడియా తో తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఇంజనీరింగ్ చదువుకుంటూనే లక్షలు సంపాదిస్తున్నాడు విశాఖకు చెందిన సూర్య స్వరూప్ అనే యువకుడు. ఆ యువకుడి సక్సెస్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తి కూడా. కచ్చితంగా ఆ యువకుడిని ఫాలో అవ్వాల్సిందే. విశాఖ నగరానికి చెందిన సూర్య స్వరూప్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆయన […]

Surya Swaroop Success Story: చేతిలో ప్రతిభ, నైపుణ్యం ఉండాలి కానీ ఏ రంగంలోనైనా రాణించవచ్చు. అలానే నిరూపించుకున్నాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. ఒక చిన్న ఐడియా తో తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఇంజనీరింగ్ చదువుకుంటూనే లక్షలు సంపాదిస్తున్నాడు విశాఖకు చెందిన సూర్య స్వరూప్ అనే యువకుడు. ఆ యువకుడి సక్సెస్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తి కూడా. కచ్చితంగా ఆ యువకుడిని ఫాలో అవ్వాల్సిందే. విశాఖ నగరానికి చెందిన సూర్య స్వరూప్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆయన చదువుతున్న కాలేజీలో 2023లో ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. అదే సూర్యస్వరూప్ స్వరూపాన్ని మార్చేసింది. లక్షలాది రూపాయలు సంపాదించే మార్గాన్ని ఇచ్చింది.

* తొలి ప్రయత్నం విఫలం..
ఆ ఫుడ్ ఫెస్టివల్ కోసం చికెన్ లోడెడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ పేరుతో సూర్య స్వరూప్ ఒక ఆహారాన్ని తయారు చేశాడు. అయితే అది ఎంతో రుచికరంగా ఉండడంతో స్నేహితులు ప్రశంసించారు. అటు తరువాత కాలేజీలో యూత్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ లోన్ యాప్ ద్వారా 35 వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. ఆ డబ్బులతో తన స్పెషల్ తయారీకి అవసరమైన సరుకులు కొనుగోలు చేశాడు. యూత్ ఫెస్టివల్ లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలని భావించాడు. కానీ ఇంతలోనే ఆ కార్యక్రమం రద్దు అయింది. అలా తెచ్చిన సరుకులు కూడా పాడయ్యాయి.

* స్నేహితుల సహకారంతో..
లోన్ యాప్ ద్వారా తీసుకున్న డబ్బులు చెల్లించేందుకు ఇబ్బందులు పడ్డాడు. స్నేహితుల వద్ద 80 వేల రూపాయలు అప్పు తీసుకుని.. ఆ లోన్ యాప్ కు కొంత మొత్తం చెల్లించాడు. మిగతా నగదుతో 2025లో ఎంవిపి డబుల్ రోడ్ లో ఫుట్పాత్ పై లోడెడ్ ఫ్రెంచ్ ప్రైస్ స్టాల్ మొదలుపెట్టాడు. ఇది ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ ఫ్రెంచ్ ప్రైస్ కు యువత నుంచి విపరీతమైన ఆదరణ దక్కింది. అయితే తన వ్యాపార విస్తరణ కోసం సోషల్ మీడియాను వాడుకున్నాడు సూర్య స్వరూప్. ఫ్రాంచైజ్ ల కోసం చాలామంది ముందుకు వచ్చారు. అలా ఏడాది కాలంలోనే ఒక్క విశాఖలో మర్రిపాలెం, సుజాతనగర్ లో కొత్త ఫ్రాంచైజీలు ఏర్పాటయ్యాయి. అనకాపల్లి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, సోలాపూర్ ప్రాంతాల్లో 16 ఫ్రాంచైజీలు ఇచ్చాడు. సూర్యకు వచ్చిన ఈ ఆలోచనకు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల ప్రోత్సాహం తోడైంది. ప్రస్తుతం నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాడు. తాను చదువుకుంటూ మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నాడు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper