Gautami Rathod: ఆమె పేరు గౌతమి రాథోడ్. పేరుకు తగ్గట్టుగానే అందంగా ఉంటుంది. గొంతు కూడా శ్రావ్యంగా ఉంటుంది. పైగా గవర్నమెంట్ టీచర్. రీల్స్ చేయడం ఆమె చాలా ఇంట్రెస్ట్. తాను పనిచేస్తున్న స్కూల్లో రీల్స్ చేసేది.
రీల్స్ ద్వారా ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా పాపులారిటీ సంపాదించుకుంది. సెలబ్రిటీ అయిపోయింది. అనుసరించే వారు కూడా భారీగా ఉండటంతో ఆమె రేంజ్ పెరిగిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. వచ్చిన ఫేమ్ ద్వారా ఆమె కొన్ని ప్రవేట్ సంస్థలకు ప్రచారం చేస్తున్నట్టు విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతో విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. విచారణ నిర్వహించారు. ఆమెను సస్పెండ్ చేశారు.
ఇటీవల ఆమెకు పోస్టు లభించింది. విధుల్లోకి వెళ్లాల్సిన ఆమె సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశారు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆమె నిర్ణయం ఒక రకంగా సంచలనం కలిగించింది. ఆమె రీల్స్ చేస్తున్నప్పుడు తోటి ఉద్యోగులు హేళనకు గురిచేసారట. ఆమెను ఇబ్బంది పెట్టారట. తట్టుకోలేక కష్టపడి సాధించిన ఉద్యోగాన్ని వదులుకున్నానని గౌతమి సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది. తాను స్కూల్లో.. విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయంలో ఎటువంటి రీల్స్ చేయలేదని ఆమె స్పష్టం చేసింది. ఒకవేళ తాను అలా రీల్స్ చేసి ఉంటే విద్యార్థులు లేదా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తనమీద ఫిర్యాదు చేసి ఉండేవారు కదా అంటూ ఆమె ప్రశ్నించారు.
అప్పట్లో గౌతమి మీద విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసినప్పుడు.. దానిని తొలగించాలని ఆమె ఏకంగా ఆరు నెలల పాటు విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరిగింది. చైతన్య జై ని ఆమెను కనీసం పట్టించుకోలేదు. తనను మనిషిలా కూడా చూడలేదని గౌతమి తన సెల్ఫీ వీడియోలో వాపోయింది. ఒక దశలో చైతన్య ఆమెను ఉద్దేశించి నువ్వు నా దగ్గరికి రావద్దు.. వెళ్లిపో అంటూ గట్టిగా కేకలు వేశారని గౌతమి సోషల్ మీడియాలో వాపోయింది. తన మీద ఆరు నెలలపాటు సస్పెన్షన్ వేటి వేసినప్పుడు తోటి ఉపాధ్యాయులు.. ఉపాధ్యాయ సంఘాలు కనీసం అండగా నిలబడలేదని గౌతమి వాపోయింది.
సరిగ్గా 6 నెలల క్రితం గౌతమి గురించి తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడిచింది. రీల్స్ టీచర్గా ఆమె పేరు పొందింది. అయితే వచ్చిన పేరును ఆమె ఒక ప్రైవేట్ సంస్థ ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంది. అందువల్ల విద్యాశాఖ అధికారులు ఆమె వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు ఆమెను సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఈయన వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. చివరికి ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
View this post on Instagram