తెలుగుదేశం పార్టీ 38వ ఆవిర్భావ దినోత్సవం కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఇళ్లకే పరిమితం అయ్యింది. పార్టీ ఆవిర్భావం అయినప్పటి నుంచి ఈ విధంగా ఎన్నడూ జరగలేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హైదరాబాద్ లోని వారి నివాసంలో పార్టీ వ్యస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వారి వారి ఇళ్ల వద్దే పార్టీ జెండా ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. విజయవాడలో రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో తన నివాసంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. గ్రామంలోని వన్ సెంటర్లలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన ఒక్కరే వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇతర జిల్లాల్లో ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్యనాయకులు వారి వారి ఇళ్ళవద్దే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. కరోనా ప్రభావంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవం బహిరంగంగా భారీ స్థాయిలో నిర్వహించలేక పోవడం నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంతకు మించి మరో మార్గం కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్లకే పరిమితమైన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
Most Popular
Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..
AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో
Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!
Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…
Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...








