పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ బాలీవుడ్ మూవీ ‘పింక్’ తెలుగు రీమేక్లో నటిస్తున్నారు. ఈ మూవీని దిల్ రాజు, శ్రీదేవి భర్త బోనికపూర్ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మీ సిటీ ఇటీవల శరవేగంగా జరుపుకుంది. అయితే దేశంలో కరోనా ఎంట్రీతో సినిమా షూటింగ్ లన్నీ వాయిదా పడ్డాయి. దీంతో ‘వకీల్ సాబ్’ మూవీ కూడా వాయిదా పడింది. అయితే అప్పటికే ‘వకీల్ సాబ్’ 80శాతం షూటింగ్ కాంప్లీట్ చేసుంది.
కరోనా వైరస్ వల్ల వచ్చిన గ్యాప్ ను కూడా ‘వకీల్ సాబ్’ సద్వినియోగం చేసుకునే పనిలో పడింది. దీనిలో భాగంగా ‘వకీల్ సాబ్’ వర్క్ ప్రమ్ చేపట్టింది. తాజాగా పవన్‌కల్యాణ్ ఇప్పటివరకు పూర్తయిన సినిమా ఎడిటింగ్ చూసి డబ్బింగ్ చెబుతున్నట్లు తెల్సింది. పవన్ కల్యాణ్ ఓవైపు కరోనాపై పోరాడుతూనే మరోవైపు ‘వకీల్ సాబ్’ మూవీ పనులను ఇంటి నుంచే చేస్తుండటం గమనార్హం. పవన్ చేస్తున్న పని ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
‘వకీల్ సాబ్’ మూవీకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ సరసన లావణ్య త్రిపాఠి ఖరారైనట్లు తెలుస్తోంది. నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేయగానే సినిమాలోని మిగిలిన షూటింగ్ త్వరగా పూర్తి చేసి అనుకున్న టైమ్‌లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుంది. పరిస్థితులు అన్ని అనుకూలిస్తే మూవీని మే15న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.