Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: సమస్యలు పక్కన పెట్టి బాబు కుల రాజకీయం..!

Chandrababu: సమస్యలు పక్కన పెట్టి బాబు కుల రాజకీయం..!

Chandrababu
Chandrababu

Chandrababu: నలబై ఏళ్ల రాజకీయ అనుభవం.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసన ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తాజా రాజకీయాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారు. హైటెక్‌ సీఎంగా గుర్తింపు ఉన్న బాబు.. లోటెక్‌ ఆలోచనలు చేస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న బాబు.. ఆలోచనలు మాత్రం హాస్యాస్పదంగా ఉంటున్నాయి.

వైఫల్యాలను పట్టుకోకుండా..
ఏపీలో అధికార వైసీపీ పాలనలో ఘోరంగా విఫలమవుతోంది. మితిమీరిన అప్పులు చేస్తోంది. ప్రజలపై అనేకరకాలుగా భారం మోపుతోంది. ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలా అనేక వైఫల్యాలు ఉన్నా.. ప్రతిపక్ష నేత చంబ్రాబు మాత్రం వైఫల్యాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమవుతున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లి తన బలం పెంచుకునే ప్రయత్నం చేయడం లేదు.

కుల రాజకీయాలకే ప్రాధాన్యం..
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పాత చింతకాయ పచ్చడి చందంగా కుల రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు. సీఎం జగన్‌ ఇస్పటికే సామాజిక వర్గాల వారీగా రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తూ అన్నివర్గాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పూర్తిగా జగన్‌ ట్రాప్‌లో పడ్డారు. అధికార పార్టీవైపు వెళ్లే కులాలను తనవైపు తిప్పుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదు.

Chandrababu
Chandrababu

పెరుగుతున్న ధరలపై పోరాడేవారేరి..
ఏపీ ప్రభుత్వం అన్నింటి ధరలను పెంచుకుంటూ పోతోంది. చిరవకు ఆలయాల్లోనూ సేవలు, అద్దె గదుల ధరలను భారీగా పెంచింది. ఉచిత సేవలను క్రమంగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తోంది. దీనిపై ఏపీలో పోరాటం చేసే పార్టీలే కరువయ్యాయి. విపక్షాలు ధరల పెరుగుదులపై నోరు కూడా మెదపడం లేదు. హిందువులకు బ్రాండ్‌ అంబాసిడర్లమని చెప్పుకునే బీజేపీ నేతలు కూడా ఆలయాల్లో వివిధ సేవల ధరల పెంపుపై స్పందించడంలేదు.

మత మార్పిడి కోసమే..
హిందు ఆలయాల్లో సేవల ధరల పెంపు, ఉచిత సేవల ఎత్తివేత వెనుక పెద్ద కుట్ర ఉందనేది వాస్తవం. ఇలా చేయడం ద్వారా హిందు ఆలయాల్లో దేవుళ్లను దర్శించుకోవడం కూడా ఖరీదే అన్న భావన ప్రజల్లో తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. తద్వారా హిందువులు మతం మారే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయినా ఏపీలో ఏ విపక్షం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు.

మొత్తంగా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో విఫలమవుతున్నారు. కేవలం కుల రాజకీయాలతోనే ఓట్లు వస్తాయన్న భ్రమలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular