LPG Booking Cyber Fraud India: పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. హర్మూజ్ జలసంధి మూసివేయడంతో గల్‌్ఫ దేశాల నుంచి రావాలన చమురు. ఎల్‌పీజీ నౌకలు నిలిచిపోయాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఎల్‌పీజీ వినియోగం తగి‍్గంచడానికి ధరలు పెంచింది. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.140 వరకు పెంచింది. మరోవైపు హర్మూజ్ వద్ద చికు‍్కకున్న నౌకలను రప్పించేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్‌తో చర్చలు జరిపారు. ఫలితంగా ఇరాన్ భారత నౌకలకు అనుమతి ఇచ్చింది. దీంతో క్రమంగా చమురు, ఎల్‌పీజీ నౌకలు భారత్‌కు చేరుకుంటున్నాయి. దీంతో రెండు నెలల వరకు చమురు నిల్వలు, నెల రోజులకు సరిపడా ఎల్‌పీజీ నిల్వలు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే గ్యాస్ కొరత భయంతో ప్రజలు ప్యానిక్ అవుతున్నారు. ముందస్తగా నిల్వ పెట్టుకునేందుకు అవసరం లేకున్నా ఎల్‌జీపీ బుక్ చేస్తున్నారు. దీనినే సైబర్ మోసగాళు‍్ల తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ప్రజలను అప్రమత్తం చేసింది. మోసగాళ్లు ఫేక్ వెబ్‌సైట్లు, వాట్సాప్ లింకులు, నకిలీ కాల్స్ ద్వారా బ్యాంక్ వివరాలు, ఓటీపీలు సేకరించి సొమ్ము దోచుకుంటున్నారని తెలిపింది. కేవలం అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారానే బుకింగ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read: అక్కా.. కేసులు వెనక్కి తీసుకో.. పాపం రేవంత్ రెడ్డిది మామూలు బాధ కాదు పో..
మొబైల్ ఫోన్లకు ఫేక్ లింకులు, ఏపీకే ఫైళ్లు..
సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో “మీ సిలిండర్ బుకింగ్ కన్ఫర్మ్ చేయండి” అనే మెసేజ్‌లు పంపుతున్నారు. ఫేక్ లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం దొంగిలించబడుతుంది. నకిలీ కాల్స్‌లో “మీ బుకింగ్ పెండింగ్, ఓటీపీ చెప్పండి” అని అడుగుతారు. ఫేక్ ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ డేటా చోరీ అవుతుంది. దీంతో బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి.
కేంద్రం కీలక సూచనలు..
గడిచిన మూడు నెలల్లో 5 వేలకుపైగా మోసాలు నమోదయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడంతో మోసాలు పెరిగాయి. సైబర్ క్రైమ్ సెల్ ప్రకారం, ఒక్కో మోసంలో సగం లక్షలు దొంగిలించబడుతున్నాయి. మహిళలు, ముఖ్యంగా గృహిణులు ప్రధాన లక్ష్యంగా మారారు. సైబర్ మోసాల వేళ కేంద్రం ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. ఎవరికీ OTPలు చెప్పవద్దు. అజ్ఞాత లింకులపై క్లిక్ చేయవద్దు. ఫేక్ ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దు. అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లు మాత్రమే వాడాలి. అనుమానాస్పద కాల్స్ వస్తే కీలక సమాచారం షేర్ చేయొద్దు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఇంకా మంచింది.
ఎల్‌పీజీ బుకింగ్ మోసాలు డిజిటల్ ఇండియా వేగంతో పెరుగుతున్న సైబర్ క్రైమ్‌లలో భాగం. పాండమిక్ తర్వాత ఆన్‌లైన్ లావాదేవీలు 300 శాతం పెరిగాయి. మోసగాళ్లు ఏఐ టూల్స్ ఉపయోగించి నకిలీ వాయిస్‌లు, వీడియోలు తయారు చేస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలు సైబర్ సెల్‌కు రిపోర్ట్ చేయాలి