Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Piracy Fine: 'ధురంధర్ 2' పైరసీ ప్రింట్ డౌన్ లోడ్ చేశారా ..?...

Dhurandhar 2 Piracy Fine: ‘ధురంధర్ 2’ పైరసీ ప్రింట్ డౌన్ లోడ్ చేశారా ..? అయితే భారీ జరిమానా తప్పదు..

Dhurandhar 2 Piracy Fine: ప్రపంచవ్యాప్తంగా ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) బాక్స్ ఆఫీస్ సునామీ ని మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం మొదటి వారాం లోనే 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈ చిత్రం సంచలనం సృష్టించింది. నిన్న కూడా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 119 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ […]

Dhurandhar 2 Piracy Fine: ప్రపంచవ్యాప్తంగా ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) బాక్స్ ఆఫీస్ సునామీ ని మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం మొదటి వారాం లోనే 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈ చిత్రం సంచలనం సృష్టించింది. నిన్న కూడా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 119 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పటికీ, ఈ చిత్రాన్ని థియేటర్ లో చూసేందుకు కొంతమంది పెద్దగా ఆసక్తి చూపించరు. కారణం రన్ టైం దాదాపుగా 4 గంటల వరకు ఉంటుంది. మళ్లీ ప్రయాణం కోసం అదనంగా మరో గంట, ఇంటర్వెల్ సమయం లో ఒక 15 నిముషాలు, దాదాపుగా సగం రోజు ఈ చిత్రం కోసం కేటాయించాల్సి ఉంటుంది. అందుకే థియేటర్ లో చూడడానికి ఆసక్తి చూపించకుండా, పైరసీ లో చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు కొంతమంది ప్రేక్షకులు.

Also Read: అక్కా.. కేసులు వెనక్కి తీసుకో.. పాపం రేవంత్ రెడ్డిది మామూలు బాధ కాదు పో..

తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్ , మ్యూ టోరెంట్స్, ఇలా ఎన్నో రకాల వెబ్ సైట్స్ లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. మేకర్స్ వీరి పై చర్యలు తీసుకోవాడ్నైకి సిద్ధం అయ్యారు. అదే విధంగా ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసిన ప్రేక్షకుల ఐపీ అడ్రెస్స్ లను పట్టుకొని, వారి పై కేసు నమోదు చేసి , పైరసీ చూసినందుకు 3 నుండి 5 లక్షల రూపాయిల జరిమానా కూడా విధించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. కాబట్టి ఈ చిత్రాన్ని పైరసీ లో చూడాలని అనుకునే ప్రేక్షకులు ఎవరైనా ఉంటే , వెంటనే ఆ ఆలోచన మానుకోండి. ఇంకో నెల రోజులు ఆగితే ఎలాగో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు కావాలంటే మీ ఇంట్లో హోమ్ థియేటర్ లో కూర్చొని మంచి సౌండింగ్ తో ఈ చిత్రాన్ని చూసుకోవచ్చు.

నిర్మాతకు ఈ పైరసీ వల్ల వచ్చే నష్టం ఏమి లేదు, రోజుకి బాక్స్ ఆఫీస్ నుండి ఈ చిత్రం ద్వారా వంద కోట్ల రూపాయిల ఆదాయాన్ని అందుకుంటున్నాడు. చివరికి అన్యాయం అయ్యేది ప్రేక్షకుడే , నిర్మాత నిజంగా సీరియస్ గా తీసుకొని కేసులు వేస్తే మాత్రం , మన ఇంట్లోని ఆస్తులు తాకట్టు పెట్టి మరీ జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంత దూరం వెళ్లడం ఎందుకు చెప్పండి, పైరసీ కి దూరంగా ఉండండి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నేడు , రేపటితో కలిపి ఈ సినిమా 1400 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper