Borra Venkata Apparao: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి ఇంఛార్జిని ప్రకటించేందుకు తెలుగు దేశం పార్టీ అధిష్టానం కసరత్తులు మొదలుపెట్టింది. అతి త్వరలో చంద్రబాబు ఈ నియోజకవర్గ ఇంఛార్జి అభ్యర్థి ని ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం .

ఇప్పటికే నలుగురు ఆశావాహులుగా ఉన్న ఈ నియోజకవర్గ నాయకులలో ప్రముఖ వ్యాపారవేత్త మరియు టీడీపీ సీనియర్ నాయకులు బొర్రా వెంకట అప్పారావు పేరు ప్రధమం గా వినిపిస్తుంది. ఈ మధ్య కాలం లో చంద్రబాబు ని కలిసి తన అభ్యరదిత్వాన్ని పరిశీలించవలసిందిగా కోరారు.పార్టీ లో కష్టపడి పని చేసే ప్రతి నాయకునికి సముచిత న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు .గత ప్రభుత్వం లో అప్పారావు గారి తండ్రి బొర్రా కోటేశ్వరరావు ఎం.పి.పి.గా పని చేసారు
కొద్దీ కాలం క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బొర్రా స్థానిక నేతలతో కలిసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన తన వంతు కృషి చేయడం జరిగింది సత్తెనపల్లి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ బలోపేతనికి ఆయన శక్తి వంచనలు లేకుండా అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు.
ఈ నియోజకవర్గానికి టీడీపీ కి బలమైన క్యాడర్ ఉంది.కానీ సరైన నాయకత్వం లేక టీడీపీ శ్రేణులు ఆందోళనచెందుతున్నారు .ఇప్పటికే రెండేళ్ల నుండి నియోజకవర్గ ఇంచార్జి పదవి ఖాళీగా ఉంది. ఇంకెన్నాళ్లు ఆ పదవిని ఖాళీ పెడతారు. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికైనా నియోజకవర్గ ఇంఛార్జి పదవిని భర్తీ చేస్తే ఆ నేత నాయకత్వంలో మేం పనిచేస్తామంటున్నారు స్థానిక నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి పలు సార్లు విన్నవించుకోవటం జరిగింది. బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్న పార్టీ గెలుపు కోసం పని చేయడానికి నాయకులు కార్యకర్తలు సంసిద్ధులై వున్నారు.