Gold: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో బంగారంను ఇష్టపడేవాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే చాలామందికి బంగారంకు సంబంధించిన నిబంధనలు అవగాహన ఉండవు. ఇంట్లో గరిష్టంగా ఎంత బంగారం దాచుకోవచ్చనే ప్రశ్నకు దేశంలోని చాలామందికి సరైన సమాధానం తెలియదు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసినా పరిమితి కంటే బంగారం తక్కువగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు.

వారసత్వంగా వచ్చిన బంగారానికి ఎలాంటి పరిమితి లేదు. వారసత్వంగా వచ్చిన బంగారాన్ని ఇంట్లో ఉంచుకున్నా ఎలాంటి సమస్యలు రావు. అధికారులు సైతం ఇందుకు సంబంధించిన ఎటువంటి ప్రశ్నలు అడగరు. ఆదాయపు వనరులు లేకుండా ఆదాయ వనరులతో పోలిస్తే ఎక్కువ బంగారం కొనుగోలు చేసి ఉంటే మాత్రం ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన బంగారానికి కచ్చితంగా లెక్కలు చెప్పాల్సి ఉంటుంది.
పెళ్లైన మహిళ ఇంట్లో గరిష్టంగా 500 గ్రాముల వరకు బంగారం ఉండవచ్చు. పెళ్లి కాని మహిళ దగ్గర గరిష్టంగా 250 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. కుటుంబంలోని మగ సభ్యుడి పేర్లపై 100 గ్రాముల వరకు బంగారం ఉంటుంది. పెళ్లి కాని వ్యక్తి అయినా పెళ్లైన వ్యక్తి అయినా ఈ మొత్తం బంగారాన్ని ఉంచుకోవచ్చు. మతపరమైన నమ్మకాల ప్రకారం ఎక్కువ మొత్తంలో బంగారం ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోరు.
ఇతరుల బంగారం మీ ఇంట్లో ఉంటే మాత్రం ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బంగారం వారసత్వంగా లేదా గిఫ్ట్ గా లభిస్తే అందుకు సంబంధించిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఆచారాలు, మత విశ్వాసాలను బట్టి అధికారులు చర్యలు తీసుకోవాలో వద్దో నిర్ణయం తీసుకుంటారు.