Homeజాతీయ వార్తలుWest Bengal Politics: బెంగాల్‌లో టీఎంసీ ‘టోల్‌’ తీస్తున్న సువేందు సర్కార్‌.. అజ్ఞాతంలోకి వెళ్తున్న బడా...

West Bengal Politics: బెంగాల్‌లో టీఎంసీ ‘టోల్‌’ తీస్తున్న సువేందు సర్కార్‌.. అజ్ఞాతంలోకి వెళ్తున్న బడా నేతలు!

West Bengal Politics: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని ప్రజలు చిత్తుగా ఓడించారు. 205 స్థానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 15 ఏళ్ల నరకం నుంచి బయట పడాలన్న కసితో ప్రజలు ఓట్లు వేశారు. టీఎంసీ పాలనలో సహించిన అన్యాయాలు భూఆక్రమణలు, ఆలయ మూసివేతలు, బడులను పార్టీ కార్యాలయాలుగా మార్చడం వంటి ఘటనలపై ఇప్పుడు ప్రజల ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ప్రజల్లో తగ్గని కోపం.. ఎన్నికల్లో టీఎంసీని ఓడించినా ఆ పార్టీ, నేతలపై ప్రజల్లో కోపం ఇంకా […]

West Bengal Politics: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని ప్రజలు చిత్తుగా ఓడించారు. 205 స్థానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 15 ఏళ్ల నరకం నుంచి బయట పడాలన్న కసితో ప్రజలు ఓట్లు వేశారు. టీఎంసీ పాలనలో సహించిన అన్యాయాలు భూఆక్రమణలు, ఆలయ మూసివేతలు, బడులను పార్టీ కార్యాలయాలుగా మార్చడం వంటి ఘటనలపై ఇప్పుడు ప్రజల ప్రతీకారం తీర్చుకుంటున్నారు.

ప్రజల్లో తగ్గని కోపం..
ఎన్నికల్లో టీఎంసీని ఓడించినా ఆ పార్టీ, నేతలపై ప్రజల్లో కోపం ఇంకా తగ్గలేదు. దీంతో గతంలో తమను ఇబ్బంది పెట్టిన నేతలు, నాయకులు, లీడర్లపై ప్రజలు తిరగబడుతున్నారు. దాడులు చేస్తున్నారు. ‘కట్‌ మనీ’ వసూళ్లు చేసినవారిని గురిచేస్తున్నారు. బీజేపీ నేతలు ఇలాంటి ప్రజలకు మద్దతు ఇస్తూ, ’ప్రజల న్యాయం’గా చూపిస్తున్నారు. ఇది టీఎంసీ గ్రామ స్థాయి నెట్‌వర్క్‌ను బలహీనపరుస్తోంది.

బడా నేతలపై దాడులు..
ఇక బడా నేతలు అయిన బోస్, షమీమ్‌ అహ్మద్‌ ఇళ్లపై పోలీసులు, ఈడీ దాడులు చేశారు. పోలీసుల దాడుల్లో ఆయుధాలు దొరికాయి. షమీమ్‌ పరారీలో ఉన్నాడు. ఇక మమతా ’రైట్‌ హ్యాండ్‌’, ఫాల్టా ఎమ్మెల్యే. జహంగీర్‌ ఖాన్‌ పరిస్థితి దారుణంగా ఉంది. ఇతను ఎన్నికల సమయంలో బీజేపీ గుర్తుపై ప్లాస్టర్‌ వేసి మోసం చేశాడు. ఎన్నిక ఆలస్యమైంది. ఇప్పుడు ప్రచారం ఆపి, జెండా కూడా దాచాడు. జర్నలిస్టు, మేధావి అయిన గర్గ్‌ చటర్జీ ఇంటికి పోలీసులు వెళ్లగా ఆయన బాత్‌రూంలో దాక్కున్నాడు. మహిళ వేషధారణలో పారిపోయే ప్రయత్నం చేశాడు. రాజ్యసభ ఎంపీ కునాల్‌ ఘోష్‌ ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్నాడు.

ఆర్థిక మోసాలపై కఠిన చర్యలు
టీఎంసీ నేతలు గోవుల అక్రమ రవాణా (విలువ రూ.100 కోట్లు), టోల్‌గేట్‌లు, ఇష్టానుసార వసూళ్లతో పార్టీ ఖజానా నింపుకున్నారు. బీఎస్‌ఎస్‌ అలర్ట్‌తో 30కి పైగా గోవుల అక్రమ రవాణాలు గ్యాంగ్ లు ప ట్టుబడ్డాయి. సువేందు అధికారి ఇల్లీగల్‌ బారికేడ్‌లు, టోల్‌గేట్‌లు మూసివేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

బీజేపీ ప్రభుత్వం టీఎంసీ గ్రౌండ్‌లెవల్‌ స్ట్రక్చర్‌ను డీమాన్‌టిల్‌ చేస్తోంది. ప్రజల కోపం, ఏజెన్సీల చర్యలు కలిసి టీఎంసీను ఒత్తిడికి తీసుకువస్తున్నాయి. మమతా బెనర్జీ దగ్గరి నేతల పరారీతో టీఎంసీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతోంది. సువేందు ప్రభుత్వం చట్టబద్ధ చర్యలు తీసుకుంటే, ఇది సానుకూల మార్పుగా మారవచ్చు. లేకపోతే అల్లర్లు మరింత పెరుగుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper